Adhire Abhi: జబర్దస్త్ సంస్థ వాళ్లకు ఇల్లు కట్టుకోమని ఎంత అడ్వాన్స్ ఇచ్చారు…నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు: అదిరే అభి

Adhire Abhi: జబర్దస్త్‌లోకి రాకముందే తనకు సొంత ఇల్లు, కారు కూడా ఉందని ప్రత్యేకంగా తాను ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు పరిస్థితులంటూ ఏమీ లేవని కమెడియన్ అదిరే అభి అన్నారు. ఒక్కోసారి షూటింగ్స్ లేకపోయినా, తమకు షెడ్యూల్‌ ప్రకారం అమౌంట్స్ పంపించేవారని ఆయన తెలిపారు. తనకే కాదు, తన టీం వాళ్లకు కూడా ఫైనాన్షియల్‌గా ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోకుండా ఉండేందుకు రెండు, మూడు షెడ్యూల్స్ అమౌంట్ ఇచ్చేవాడినని ఆయన చెప్పారు. ఎందుకంటే ఆ షోలో ఎప్పటికైనా షెడ్యూల్ ప్రకారం ఈవెంట్ జరుగుతుందనే నమ్మకం ఉందని, ఆ తర్వాత మళ్లీ బాలెన్స్ చేసుకోవచ్చని అలా చేశానని ఆయన స్పష్టం చేశారు.

ఇకపోతే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అందరికీ ఇల్లులు బుక్ చేశారని, మల్లెమాల ఆ ఆఫర్ వచ్చిందన్న మాటల్లో తనకు తెలిసి నిజం లేదని అభి చెప్పారు. లేదంటే ఆల్రెడీ కంటిన్యూ అవుతున్న వాళ్లకు ఇంకో 3 ఏళ్లు కచ్చితంగా కొనసాగుతారు అని గ్యారంటీ ఉన్నవాళ్లకు, ఒకవేళ ఒక సంవత్సరం అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చి ఉండొచ్చని ఆయన అన్నారు. తనకు ఈ విషయంపై అంతగా క్లారిటీ లేదని, ఎందుకంటే ఆ మనీ తాను తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా తాను ఒకరి దగ్గర అప్పు తీసుకున్నానంటే అసలు నిద్ర పట్టదన్న అదిరే అభి, ఇప్పుడు తన సినిమా కోసం ఇన్వెస్ట్ చేసిన ప్రొడ్యూసర్ కి ఆయన పెట్టిన డబ్బులు వచ్చే వరకే తనకు మనశ్శాంతిగా ఉండదని, అలాంటిది తాను ఇంకొకరి దగ్గర ఎలా డబ్బులు తీసుకుంటాను అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటివరకూ తన లైఫ్‌లో ఒకే ఒక్క సారి తన అన్నయ్య దగ్గర 20వేల రూపాయలు తీసుకున్నానని, అది కూడా నెల తిరిగేలోగా ఇచ్చేశానని ఆయన చెప్పారు. లగ్జీరియస్‌గా బతకకపోయినా పర్లేదు గానీ, ఉన్నదాంట్లో అడ్జస్ట్ అవ్వగలను కానీ, అప్పు చేసి మరీ ఇబ్బందులు తెచ్చుకోనని ఆయన వివరించారు.