మెగా బ్యూటీ నిహారికకి పెళ్ళి కళ వచ్చేసింది. మరి కొద్ది రోజులలో ఈ అమ్మడు చైతన్యతో కలిసి ఏడడుగులు వేయనుంది. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో డిసెంబర్ 9న నిహారిక పెళ్లి వేడుక జరగనుండగా, డిసెంబర్ 11న.. హైదరాబాద్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్‌లో జరగనుంది. పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు. హైదరాబాద్‌లో జరగనున్న రిసెప్షన్‌కు మాత్రం సన్నిహితులు, శ్రేయోభిలాషులు, ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు అందరు హాజరు కానున్నారు.
గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక పెళ్లి డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథుల లగ్నంలో జరగనుంది. ఈ పెళ్ళికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు వరుణ్ తేజ్ చూసుకుంటున్నాడట. నిహారిక ఎంగేజ్‌మెంట్‌కు హాజరు కాలేకపోయిన పవన్ కళ్యాణ్ పెళ్లికి మాత్రం రెండు రోజుల ముందే వెళ్లి అన్ని ఏర్పాట్లని పర్యవేక్షిస్తాడట. మెగా ఫ్యామిలీ అంతా ఈ పెళ్ళి వేడుకకు హాజరు కానుండగా, వారి సందడితో ప్యాలెస్ శోభాయమానంగా మారనుంది. అయితే తాజాగా నిహారిక పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మెగా ఫ్యామిలీ రేంజ్‌లోనే ఈ వెడ్డింగ్ కార్డ్ ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు
ముద్దపప్పు అవకాయ్, నాన్నకూచి, మ్యాడ్ హౌస్ వంటి వెబ్ సిరీస్‌లతో తెలుగు ప్రేక్షకులని అలరించిన నిహారిక ఒక మనసు , సూర్యకాంతం, సైరా, ఒరు నెల్ల నాల్ పొత్తు అనే సినిమాలలో నటించింది. అశోక్ సెల్వన్‌తో కలిసి ఓ సినిమాలో నిహారిక నటిస్తుందని వార్తలు వినిపించాయి కూడా. అయితే చివరి నిమిషంలో ఆ ప్రాజెక్ట్ నుండి నిహారిక తప్పుకుంది. పెళ్లి తర్వాత కూడా నిహారిక సినిమాలు చేయనుంది. ఇక వెంకట చైతన్య జొన్నలగడ్డ టెక్ మహేంద్రలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే కరోనా జాగ్రత్తలు పాటిస్తూ నిహారిక, చైతన్యల డెస్టినేషన్ మ్యారేజే చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయగా, అందరి దృష్టి ఈ వేడుకపైనే ఉంది