చాలా కాలం తర్వాత ప్రభాస్ ఖాతాలో మాస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా ‘సలార్’. ఎన్నో అంచనాల మధ్య గతేడాది డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ ఊహించని స్థాయిలో సెన్సెషన్ సృష్టించింది. ‘బాహుబలి’ తర్వాత ఆ రేంజ్ హిట్ అందించిన మూవీ ఇదే కావడం విశేషం.
ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తీసుకువస్తున్నారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ విజయంతో.. ఇప్పుడు సెకండ్ పార్ట్ పై మరింత హైప్ పెరిగింది. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. విడుదలైన నెల రోజుల్లోనే డిజిటల్ ప్లాట్ ఫాంలోకి రాబోతుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ప్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని గతంలోనే అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. ఇక ఇప్పుడు స్టీమ్రింగ్ డేట్ ప్రకటించి ప్రేక్షకులకు సర్ ప్రైజ్ చేసింది నెట్ ప్లిక్స్. ఈ సినిమా జనవరి 20 నుంచే స్ట్రీమింగ్ కాబోతుందని తెలిపారు.
అంటే మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతుంది. ఇప్పుడు అభిమానులు, ప్రేక్షకులు ఆనందపడుతున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఆ తర్వాత హిందీలో ఈ మూవీ రిలీజ్ అవుతుందని తెలుస్తోంది.