క్యారవాన్ లో అది తప్పనిసరిగా ఉండాల్సిందే.. అసలు విషయం చెప్పిన నిహారిక!

మెగా డాటర్ నిహారిక గురించి పరిచయం అవసరం లేదు ఈమె యాంకర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం పలు సినిమాలలో హీరోయిన్ గా నటించారు. అయితే హీరోయిన్ గా వెండితెరపై ప్రేక్షకులను సందడి చేయలేదని చెప్పాలి. ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించకపోవడంతో ఈమె జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.ఇక పెళ్లి తర్వాత కూడా నిహారికకు నటనపై ఆసక్తి ఉండడంతో ఈమె వెబ్ సిరీస్ లను నిర్మించడమే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈమె తాజాగా హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇకపోతే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క స్టార్ సెలబ్రెటీ కూడా షూటింగ్ లొకేషన్లోకి అడుగు పెట్టారు అంటే తప్పనిసరిగా వారి వెంట కేరవాన్ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్క సెలబ్రిటీ వారికి ఇష్టమైన విధంగా కోట్లు ఖర్చు చేసి క్యారవాన్ డిజైన్ చేయించుకుంటున్నారు. మెగా డాటర్ నిహారిక సైతం తన కేరవాన్ గురించి పలు విషయాలను బయటపెట్టారు.

ఈ సందర్భంగా ఆమె తన కేరవాన్ గురించి మాట్లాడుతూ తన వ్యానిటీ వ్యాన్ లోఏ ఏ వస్తువులు ఉండాలనే విషయం గురించి మాట్లాడుతూ తప్పనిసరిగా తన వ్యానిటీ వ్యాన్ లో తన భర్త చైతన్యతో పాటు తన భర్త తనకు మొదటిసారిగా ఇచ్చిన పెట్ బజ్ ముగ్గురు కలిసి దిగిన ఫోటో తప్పనిసరిగా ఉండాలని, ఈ ఫోటో తన వ్యానిటీ వ్యాన్ లో ఉంటుంది అంటూ ఈమె ఈ సందర్భంగా అసలు విషయాన్ని తెలియజేశారు. ఇలా నిహారిక ఈ ఫోటోకి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.