Allu Arjun: షూటింగ్ ఉంటే పండగలా ఉంటుంది అనేవారు…బన్నీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఉపేంద్ర!

Allu Arjun: కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర ఎంత విలక్షణ నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ తొలినాళ్ల నుంచీ ఉపేంద్ర రూటే సెపరేటు. ఆయన ఎంచుకునే కథలు కూడా మిగతా హీరోల సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండడం విశేషం. సినిమా కథలే కాదు అందులో ఉపేంద్ర గెటప్స్ కూడా డిఫరెంట్‌గా ఉండడం మరో చెప్పుకోదగిన అంశం. ఇక కన్నడనాట తరగని క్రేజ్ సొంతం చేసుకున్న ఉప్పీ..నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా సినీ ప్రియులను మెప్పించారు. కన్యాదానం, ‘ఉపేంద్ర, ఒకే మాట, రా!, నీతోనే ఉంటాను, టాస్, సెల్యూట్, సన్నాఫ్‌ సత్యమూర్తి వంటి తెలుగు చిత్రాల్లో హీరోగానే కాక, పలు కీలక పాత్రల్లోనూ ఉపేంద్ర అలరించారు.

ఇక ఉపేంద్ర తెలుగులో చేసిన కొద్ది పాటి సినిమాలతోనే ఆయనకి టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు హీరోగా పలు చిత్రాల్లో నటించిన ఉపేంద్ర, ఇటీవలి కాలంలో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి, మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు. విభిన్న పాత్రల్లో, విభిన్న గెటప్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఉపేంద్ర, తెలుగులో అల్లు అర్జున్ హీరోగా తీసిన సన్నాఫ్ సత్యమూర్తి అనే సినిమాలో ఓ ప్రధాన పాత్రల్లో నటించి ఎంతో పేరు తెచ్చుకున్నారు. అయితే ఆ షూటింగ్ సమయంలో బన్నీ తనతో ఎలా ఉండేవాడో ఉపేంద్ర కొన్ని ఆసక్తి కరమైన విషయాలను పంచుకున్నారు.

సన్నాఫ్ సత్యమూర్తి సినిమా షూటింగ్ సెట్ లో బన్నీ తనతో ఎంతో సరదాగా ఉండేవారని ఉపేంద్ర చెప్పుకొచ్చారు. తనకు ఇష్టమైన వంటకాలు ఏమిటో తెలుసుకుని మరీ తెప్పించేవారని అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తనను ఒక గిఫ్టులా చూసుకున్నారు అంటూ బన్నీని కొనియాడారు. మీకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది ఖరీదైన కార్లా.? లేదంటే టూర్లకు వెల్లడమా ? అని బన్నీని అడిగితే అసలు నాకు దీనిపైన ఇష్టం ఉండదని, సినిమా తప్ప తనకు ఏదీ సంతోషాన్ని కలిగించదని, షూటింగ్ అంటే నాకు పండగలా అనిపిస్తుంది అంటూ ఆయన సమాధానం చెప్పినట్టు ఉపేంద్ర తెలిపారు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వారు అల్లు అర్జున్ ని చూసి చాలా నేర్చుకోవాలి అంటూ ఉపేంద్ర బన్నీని పొగడ్తలతో ముంచెత్తారు. ఇకపోతే తాజాగా వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని సినిమా ఈ మధ్యే విడుదలైంది. ఈ చిత్రంలోనూ ఉపేంద్ర ఓ ప్రధాన పాత్రలో నటించారు.