ప్రాజెక్ర్ ‘K’ అంటే అర్థం ఇదేనా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె సినిమా సంగతి అందరికీ తెలిసిందే. ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతూ ఉన్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్ లో సిద్ధం అవుతున్న ఈ మూవీ ఫ్యూచర్స్టిక్ కాన్సెప్ట్ తో ఉండబోతుందనే మాట వినిపిస్తుంది.ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు.

ఇక బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా మూడవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఉంటుందని ప్రచారం చాలా రోజులుగా వినిపిస్తూ ఉంది. అలాగే మహాభారతంలోని పాత్రలను తీసుకొని భవిష్యత్తు కథాంశంలో చూపించబోతున్నారు అనే మాట కూడా ప్రచారంలో ఉంది.

అయితే ఇక ఈ సినిమాలోని ప్రభాస్ పోషించబోయే పాత్ర ఎలా ఉండబోతుంది అనేది సర్వత్ర ఆసక్తి నెలకొని ఉంది. ఇక ప్రభాస్ ఒక సూపర్ మెన్ తరహా పాత్రలో ఈ మూవీలో కనిపించబోతున్నారని కూడా వినిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు కేవలం హాండ్స్ ని రిప్రజెంట్ చేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేశారు.

ఇక ఆ పోస్టర్స్ బట్టి కథలో ఆ హ్యాండ్స్ పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో ప్రచారం తెరపైకి వచ్చింది. ప్రాజెక్ట్ కె అనే టైటిల్ ని డీకోడ్ చేశారు. ప్రాజెక్ట్ కృష్ణ లేదా ప్రాజెక్ట్ కర్ణ అని ఈ మూవీ టైటిల్ రిప్రజెంట్ చేస్తూ ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు.

ఇక భూత భవిష్యత్తు వర్తమానాలను కలిపే విధంగా ఈ సినిమా కథాంశం ఉంటుందని భావిస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అవుతుంది అనేది వేచి చూడాలి. అయితే మహాభారతంలోని పాత్రలని భవిష్యత్తుకి అన్వయించి చూపిస్తున్నారు అనేది వాస్తవం అని టాక్ నడుస్తుంది. ఇక అమితాబచ్చన్ పరశురామ్ పాత్రలో కనిపించబోతున్నారు అనే మాట వినిపిస్తుంది.