టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన కృష్ణ మొదట తన మరదలు అయిన ఇందిరా దేవిని వివాహం చేసుకున్నాడు. ఇక 1967లో సాక్షి అనే సినిమాలో కృష్ణ, విజయనిర్మల కలిసిన నటించారు. ఈ సినిమా ద్వారా వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కొంతకాలానికి స్నేహంగా మారింది. ఆ తర్వాత సర్కార్ ఎక్స్ప్రెస్ సినిమాలో ఇద్దరూ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సమయంలో కృష్ణ విజయనిర్మలని ప్రేమిస్తున్నట్లు తెలిపి ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. దీంతో విజయనిర్మల కూడా కృష్ణను పెళ్లి చేసుకోవటానికి అంగీకరించి ఇద్దరు తిరుపతిలో వివాహం చేసుకున్నారు.
అయితే ఇలా కృష్ణ విజయనిర్మలను రెండవ పెళ్లి చేసుకున్న కూడా ఇందిరాదేవి వారి వివాహం పట్ల వ్యతిరేకత తెలుపకుండా విజయనిర్మలను ఆదరించింది. విజయనిర్మల కూడా కృష్ణ మొదటి భార్య పిల్లల పట్ల ఎంతో ప్రేమగా ఉండేది. ఇలా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల కృష్ణ కుటుంబంలో ఎటువంటి గొడవలు లేకుండా సాఫీగా సాగిపోయింది. అయితే కృష్ణ తల్లిదండ్రులు కూడా కొడుకు రెండవ పెళ్లిని అంగీకరించటమే కాకుండా కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవిని వదిలేసి విజయనిర్మల వద్ద ఉండేవారు.
గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయనిర్మల ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించింది. ఈ ఇంటర్వ్యూలో విజయనిర్మల మాట్లాడుతూ.. వంటలు తన అత్తగారికి బాగా నచ్చడం వల్లే ఇందిరా దేవి వద్ద కాకుండా తన వద్ద ఉండేవారని.. తన వంటలతో తన అత్తమామలను బుట్టలో వేసుకున్నట్లు విజయనిర్మల వెల్లడించింది.ఇక తన అత్తగారు చనిపోయే చివరి రోజు కూడా బెండకాయ కూర రసం చేసి పెట్టమని స్వయంగా అడిగిందని విజయనిర్మల చెప్పుకొచ్చింది. ఇలా ఇందిరా దేవి కన్నా విజయనిర్మల అద్భుతంగా వంటలు చేసి అత్తమామలను తన వద్ద ఉంచుకుంది. ఇలా అత్తమామలకు వండి పెట్టడమే కాకుండా కృష్ణ సినిమా షూటింగ్ లో ఉన్నా కూడా ఆయనతో పాటే ఉంటూ స్వయంగా తానే అందరికీ భోజనం తయారు చేసి వడ్డించేది.