ఇన్సైడ్ టాక్ : నితిన్ సినిమాకి ఇది కేవలం పబ్లిసిటీ స్టంటా లేక..?

ఓ సినిమాని పబ్లిక్ లోకి తీసుకెళ్లాలి అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ప్రమోషన్స్ తప్పనిసరిగా మారిపోయింది. పలువురు బిగ్ స్టార్స్ కూడా నేరుగా రంగంలోకి దిగకపోతే సినిమాకి జనం రాని పరిస్థితి. దీనితో చిత్ర యూనిట్ వాళ్ళు కూడా కాస్త వినూత్నంగానే ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ ప్రమోషన్స్ ఇనోవేటివ్ గా ఉంటే పర్వాలేదు కానీ శృతి మించితే మొదటికే మోసం వస్తుంది. అయితే ఈ తరహాలో తాజాగా యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన సినిమా “మాచర్ల నియోజకవర్గం” కోసం అంతా ఆసక్తిగా మారింది.

ఈ సినిమా దర్శకుడు రాజశేఖర్ రెడ్డి కులాల పై చేసిన కొన్ని కామెంట్స్ పోస్ట్ లు షాకిచ్చే లెవెల్లో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దీనితో ఈ చిత్రం కోసం అంతా హాట్ టాపిక్ గా మరి ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. అయితే సినిమాలకి రాజకీయాలకి లింక్ ఏంటి అనే కామెంట్ కూడా ఉంది కానీ అల్టిమేట్ గా సినిమాకి కావాల్సింది రీచ్.

అది ఈ సినిమాకి బాగా వచ్చిందని అంతా అంటున్నారు. దీనితో ఈ ట్వీట్ ఆ ఫేక్ పోస్ట్ లు వంటివి కేవలం పబ్లిసిటీ స్టంట్ గా మాత్రమే చేసారని మరికొందరు అంటున్నారు. అయితే ఎంత పబ్లిసిటీ స్టంట్ అయినా కూడా పోలీసులని సంప్రదించారు అనేది సింపుల్ గా తీసుకునేది కాదు. అందుకే దీన్ని కేవలం పబ్లిసిటీ స్టంట్ అనే చెప్పలేం. మరి ఫైనల్ గా అయితే ఏమవుతుందో చూడాలి.