A – ఆది పురుష్ లో సీతగా ఈ బాలీవుడ్ హీరోయిన్ నే ప్రభాస్ బర్త్ డే రోజున అనౌన్స్ చేయనున్నారా ..?

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో ఇప్పుడు సినిమా చేయాలంటే మేకర్స్ ఎంత కాదన్నా 300 కోట్ల బడ్జెట్ కి పైగానే కేటాయించాలి. టాలీవుడ్ కంటే కూడా బాలీవుడ్ మేకర్సే ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేయాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ ఒప్పుకుంటే ధూమ్ ఫ్రాంఛైజీ లో 4 వ భాగాన్ని నిర్మించడానికి మేకర్స్ సిద్దంగా ఉన్నామని తెలిపారు. కాని ఎందుకనో ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ మీద అంతగా ఆసక్తి చూపించలేదు.

అంతేకారు కరణ్ జోహార్ లాంటి బాలీవుడ్ బడా మేకర్స్ అందరూ ప్రభాస్ తో సినిమా చెయ్యాలని డేట్స్ కోసం ఆశగా ఉన్నారు. కాగా ఇప్పుడు ప్రభాస్ చేతిలో వరసగా ఉన్నవన్ని భారీ ప్రాజెక్ట్సే. వాటిలో “ఆదిపురుష్” చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓంరౌత్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించబోతున్నాడు. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సీత పాత్రకు ఎవరిని ఎంచుకోనున్నారన్న క్యూరియాసిటీ సౌత్ మొత్తం ఉంది. ప్రచారంలో అయితే కీర్తి సురేష్, దీపిక పదుకొణె, కియారా అద్వాని, పూజా హెగ్డే అంటూ వార్తలు వస్తున్నాయి.

కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఆదిపురుష్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించబోతుందని సమాచారం. దీపిక పదుకొణె తర్వాత నేషనల్ వైడ్ గా మళ్ళీ అంతటి క్రేజ్ ఉంది ప్రియాంక చోప్రా కే. ఆ స్టార్ హీరోయిన్ నే ఆదిపురుష్ లో ప్రభాస్ కి జంటగా సీత పాత్ర కి ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియనప్పటికి దాదాపు ఈ హీరోయిన్ నే మేకర్స్ ఫిక్స్ చేసినట్టు బాలీవుడ్ వర్గాలలో చెప్పుకుంటున్నారు. ఈ నెల 23 న ప్రభాస్ బర్త్ డే కి ఈ విషయాన్ని అధికారకంగా వెల్లడించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో రావణ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా దాదాపు 750 కోట్ల బడ్జెట్ ఈ సినిమాని నిర్మించనున్నారట.