తనికెళ్ళ భరణి ఇలా మారడానికి కారణం ఆ నటుడేనా!

తనికెళ్ళ భరణి ప్రముఖ నటుడు, రచయిత గా అందరికీ సుపరిచితమే. 1956లో పశ్చిమగోదావరి జిల్లాలోని జగన్నాధపురం గ్రామంలో జన్మించారు. తనికెళ్ళభరణి భార్య పేరు దుర్గ భవాని. వీరికి ఒక కుమారుడు మహా తేజ, ఒక కుమార్తె సౌందర్యలహరి సంతానం. తనికెళ్ళ భరణి హైదరాబాదులోని రైల్వే కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఒక నాటకం వేయాల్సి వచ్చినప్పుడు అద్దె కొంప అనే నాటకాన్ని ప్రదర్శించడం వల్ల మంచి పేరు ఇంకా బహుమతి కూడా వచ్చింది.

తరువాత ఈయన రాసిన కొన్ని కవితలు ఆంధ్రజ్యోతిలో ప్రచురితం అయ్యాయి. బీకాం చదివే రోజుల్లో రాళ్లపల్లి తో పరిచయం ఏర్పడింది. రాళ్లపల్లి గారు రాసిన ముగింపు లేని కథ లో 70 సంవత్సరాల వృద్ధిని పాత్రలో నటించినందుకు మంచి గుర్తింపు వచ్చింది. రాళ్లపల్లి గారి నాటక సంస్థ శ్రీ మురళి కళానిలయం. తరువాత రాళ్లపల్లి గారు మద్రాసు వెళ్లినప్పుడు అక్కడ వారి సంస్థకు రచయితల కొరత ఏర్పడడంతో తనికెళ్ళభరణి 10 నాటకాలను రాసి ఇచ్చారు. ఆ నాటకాలకు తళ్ళవదుల సుందరం గారు దర్శకత్వం వహించారు. వీటికి మంచి గుర్తింపు వచ్చింది.

తనికెళ్ల భరణి రాసిన చల్ చల్ గుర్రం నాటకం మంచి గుర్తింపు తెచ్చింది. తరువాత వంశీ గారితో పరిచయం ఏర్పడి కంచు కవచం అనే సినిమా రచయితగా, నటుడిగా అవకాశం ఇచ్చారు. తనికెళ్ల భరణి గారు ఎక్కువగా విలన్ పాత్రలను పోషించారు. లేడీస్ టైలర్ సినిమాలో ఆయన నటించిన పాత్ర మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. రచయితగా దాదాపు 60 కి పైగా సినిమాలు రచించారు. తెలంగాణ యాసలో మాటలు రాయడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. మొండి మొగుడు పెంకి పెళ్ళాం సినిమాలో హీరోయిన్ పాత్ర కు ఈయన రాసిన మాటలు మంచి గుర్తింపు వచ్చింది.

ఈయన కమీడియన్, విలన్, తండ్రి పాత్రలలో దాదాపు 320 చిత్రాలలో నటించారు. మిధునం అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి రచయితగా అవార్డును కూడా పొందారు. సముద్రం సినిమా ద్వారా ఉత్తమ విలన్ గా అవార్డు పొందారు. ఇలా చెప్పుకుంటూ పోతే భరణి గారు ఏ పాత్రలోనైనా జీవించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బయట జరిగే కొన్ని సంఘటనలను కూడా ఆయన ఆర్టికల్స్ రాస్తుంటారు. అతడు సినిమాలో ఆడు మగాడ్రా బుజ్జి అనే డైలాగు ఎప్పటికీ మర్చిపోలేనిది. ఇలా ఈయన సినిమా రంగంలో రాణిస్తున్నారు.