బాలకృష్ణ అభిమానులపై చేయి చేసుకునేది అందుకేనా.. అసలు విషయం చెప్పిన నటుడు?

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నటువంటి ఈయన రాజకీయాలలో కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.ఇకపోతే ఇండస్ట్రీలో బాలకృష్ణకు ఉన్నటువంటి అందరికీ తెలిసిందే. అయితే ఈయన ముందు ఎవరైనా పిచ్చి వేషాలు వేసినా వారికి దబిడి దిబిడే అనే విషయం మనకు తెలిసిందే. అభిమానులు బాలకృష్ణ ముద్దు పిచ్చిగంతులు వేస్తే వెనుక ముందు ఆలోచించకుండా చెంపచెల్లుమనిపిస్తారు..

ఇలా బాలకృష్ణ అభిమానులపై చేయి చేసుకోవడంతో చాలామంది బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి ఎన్నో విమర్శలు చేశారో అయితే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది? ఆయన మనసు ఎలాంటిదనే విషయం ఆయనతో పనిచేసిన నటీనటులకు మాత్రమే తెలుస్తుంది.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పింగ్ పాంగ్ సూర్య బాలకృష్ణతో కలిసి పలు సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే ఈయన బాలకృష్ణ మనస్తత్వం గురించి అసలు విషయం వెల్లడించారు.

సాధారణంగా బాలకృష్ణ చుట్టూ అభిమానులు పెద్ద ఎత్తున చేరే ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేసిన ఈయన చేయి చేసుకుంటారని మనకు తెలుసు. ఈ విషయంపై నటుడు సూర్య మాట్లాడుతూ బాలకృష్ణ అలా చేయడానికి కూడా ఓ కారణము ఉందని తెలిపారు. నిజానికి ఆయన ఎంతో మంచి మనసు కలవారిని చిన్న ఆర్టిస్టుల నుంచి పెద్దవారి వరకు అదే గౌరవ మర్యాదలతో మాట్లాడుతారని తెలిపారు.సాధారణంగా ఒక సెలబ్రిటీ వచ్చారంటే పెద్ద ఎత్తున అభిమానులు చుట్టుముడుతారు వారిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. అందుకే బాలయ్య ఒక అభిమాని పై చేయి చేసుకుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా సైలెంట్ అవుతారు అందు కోసమే బాలయ్య అభిమానులపై చేసుకుంటారు తప్ప మరో ఉద్దేశం లేదని ఈయన తెలిపారు.