లీడర్ సినిమా ద్వారా దగ్గుబాటి కుటుంబం నుండి హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రానా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లీడర్, నేను నా రాక్షసి, కృష్ణం వందే జగద్గురు, బాహుబలి, విరాటపర్వం వంటి ఎన్నో సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు పొందిన రానా తెలుగులో పాటు తమిళ్ హిందీ భాషలలో కూడా ఎన్నో సినిమాలలో నటించి పాన్ ఇండియా లెవెల్ లో నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇలా సినిమాలలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా మారి మంచి గుర్తింపు పొందాడు.
అంతేకాకుండా ఆహా లో ప్రసారమైన నంబర్ 1 యారి అనే టాక్ షోలో కూడా హోస్ట్ గా వ్యవహరించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇలా హీరోగా, విలన్ గా, వ్యాఖ్యాతగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న రానా చేతిలో ప్రస్తుతం ఒక సినిమా కూడా లేకపోవడం గమనార్హం. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా ఎప్పుడు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే రానా విరాటపర్వం సినిమా తర్వాత మరొక కొత్త ప్రాజెక్టుకి సైన్ చేయలేదు. అయితే ఇలా రానా కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటానికి గల కారణాల గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
సోషల్ మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. గతంలో రానా అనారోగ్యంతో బాధపడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కూడా రానా మరొక్కసారి అనారోగ్యం కారణంగా చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. అందువల్లనే రానా మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని.. అతని ఆరోగ్యం పూర్తిగా కోలుకున్న తర్వాత మరొక కొత్త ప్రాజెక్టుకి సైన్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా రానా అభిమానులు మాత్రం మంచి కథ దొరకకపోవటం వల్లే రానా కొత్త సినిమాకు సైన్ చేయలేదని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ… ఇలా రానా సినిమాలకు గ్యాప్ తీసుకోవటంతో అతని అభిమానులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.