సావిత్రి చివరి రోజులలో ఎన్టీఆర్ ఏఎన్నార్ ఆదుకోకపోవడానికి అదే కారణమా?

సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహానటి సావిత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే.ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె అడిగిన వారికి చేయని దానం అంటూ లేదు. ఇలా ఇండస్ట్రీలో సంపాదించినది మొత్తం దానధర్మాలను కోసం ఖర్చు చేయడమే కాకుండా నమ్మిన వారి చేతిలోనే దారుణంగా మోసపోయి చివరి రోజులలో ఎంతో దారుణమైన బ్రతుకు అనుభవించారని అందరికీ తెలిసిందే. ఇలా మానసిక వేదనతో చివరి క్షణాలలో ఎక్కువ తాగుడుకు బానిసయ్యి ఈమె అనారోగ్య కారణంగా మృతి చెందారు.

ఇకపోతే ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి ఆగ్ర హీరోల సరసన నటించి ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలను అందుకున్నటువంటి ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు.అయితే ఈమె చివరి క్షణాలలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి వారు ఏ మాత్రం ఆదుకోలేకపోయారు. ఇలా వారు ఆదుకోలేకపోవడానికి ఓ కారణం ఉందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి వారు ఈమెను ఆదుకోకవడానికి సావిత్రి మొండితనమే కారణమని తెలుస్తుంది. ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయం బాగా తాగుడికి అలవాటుపడ్డారు. అయితే తనని ఆ వ్యసనాలు మానుకోమ్మని ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి వారు చెప్పినప్పటికీ మొండితనంతో వారి మాటలను లెక్క చేయలేదట. ఇలా అలాంటి గొప్ప నటీనటులు చెప్పినప్పటికీ ఈమె వినకపోవడంతో ఆమె చివరి క్షణంలో కూడా ఈ హీరోలే కాకుండా ఇతర సెలబ్రిటీలు కూడా ఈమెను పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది.