ఎన్టీఆర్, కె.విశ్వనాథ్ కు విభేదాలు రావడానికి అసలు కారణం అదేనా!

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ గారు అందరికీ సుపరిచితుడు. కొన్ని దశాబ్దాల పాటు అగ్ర హీరోగా ఇంకా రాజకీయ నాయకుడిగా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఈయన 1923లో కృష్ణాజిల్లాలోని నిమ్మకూరులో జన్మించారు. 1942లో తన మేనమామ కూతురు బసవతారకమును వివాహం చేసుకున్నారు. ఈయనకు ఎనిమిది మంది కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఎన్టీఆర్ గారు తెలుగు, తమిళం,హిందీ లలో దాదాపు 400 చిత్రాలలో నటించారు. రాముడు కృష్ణుడు, వంటి పౌరాణిక పాత్రలలో నటించారు. జానపద, సాంఘిక చిత్రాలలో కూడా నటించారు.

రామారావు గారు విద్యాభ్యాసం చేసే రోజులలో వారి ఆస్తి అంతా హరించుకుపోయింది. అప్పట్లో ఆయన పాల వ్యాపారం, కిరాణా కొట్టు, ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపారు. 1947లో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత మంగళగిరిలో సబ్ రిజిస్టర్ గా ఉద్యోగం వచ్చింది. కే.విశ్వనాథ్ గారు గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్, హిందూ కాలేజీలో డిగ్రీ చదివారు. హిందూ కాలేజీలో కె.విశ్వనాథ్ కు సీనియర్ ఎన్టీఆర్ గారు. ఉద్యోగరీత్యా విజయవాడ నుండి గుంటూరుకు ట్రైన్ లో ప్రయాణం చేసేవారు ఎన్టీఆర్. అదే ట్రైన్ లో ప్రయాణం చేసేవారు కె. విశ్వనాథ్. అప్పుడు వీరి మధ్య పరిచయం ఏర్పడింది. తర్వాత సినిమాలపై మక్కువతో ఎన్టీఆర్ గారు మద్రాస్ వెళ్లిపోయారు.

కె.విశ్వనాథ్ గారు వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ గా చేరారు. వాహిని స్టూడియోలో కలుసుకుంటూ ఇద్దరు పాత పరిచయం గుర్తుచేసుకుంటూ స్నేహంగా ఉండేవారు. ఎన్టీఆర్ గారు ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన పల్లెటూరి పిల్ల సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. కానీ తర్వాత చిత్రం మన దేశం 1949లో విడుదలై ఆ తర్వాత 1950లో పల్లెటూరి పిల్ల విడుదల అయ్యింది. మొదటి సినిమాకు ఈయన తీసుకున్న రెమ్యూనిరేషన్ వెయ్యినూటపదహార్లు. తరువాత ఉద్యోగాన్ని కి రాజీనామా చేశారు.

ఎన్టీఆర్ గారితో కే విశ్వనాథ్ మొదట దర్శకత్వం వహించిన సినిమా కలిసి వచ్చిన అదృష్టం. ఎస్వీఎస్ ఫిలిం బ్యానర్ పై జగన్నాధ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం 1968లో రిలీజ్ అయ్యి అబవ్ యావరేజ్ గా పేరు తెచ్చుకుంది. 1969లో కే విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన నిండు హృదయాలు చిత్రంలో ఎన్టీఆర్ గారు నటించారు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రాని జగన్నాథ రావు గారే నిర్మించారు. తరువాత మీ కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం నిండు దంపతులు.

ఈ చిత్రం 1971లో విడుదలై యావరేజ్ గా ఆడింది. తరువాత ఇదే సంవత్సరంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నాలుగవ చిత్రం చిన్ననాటి స్నేహితులు ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాల్లోనే వీరిద్దరికీ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. ఇద్దరికీ దూరం పెరిగింది ఈ కారణం ద్వారా ఇద్దరు కలిసి సినిమాలు చేయలేకపోయారు. తరువాత ఎస్వీఎస్ వారు సమర్పించు డబ్బుకు లోకం దాసోహం చిత్రం కథ మొత్తం తయారయ్యే వరకు కే. విశ్వనాథ్ గారే ఉన్నారు కానీ వీరి మధ్య విభేదాలు కారణంగా కే విశ్వనాధుని తీసేసి యోగానంద్ ను దర్శకుడిగా పెట్టి ఈ సినిమాను తీశారు ఎస్వీఎస్ సంస్థ అధినేతలు. తరువాత 14 సంవత్సరాల కు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణతో జననీ జన్మభూమి సినిమా దర్శకత్వం వహించారు కే విశ్వనాథ్. ఈ సినిమా ప్లాప్ అయ్యింది.