అలనాటి హీరోయిన్ రాధిక తన అద్భుతమైన నటనతో పలు విజయవంతమైన సినిమాల్లో నటించి కొన్ని దశాబ్దాల పాటు అగ్ర కథానాయకగా కొనసాగింది. తెలుగు తమిళ్ ఇండస్ట్రీలో ఈమెకు లెక్కలేనంత మంది అభిమానులు ఇప్పటికే ఉన్నారు. ఒకానొక దశలో రాధిక చేసిన సినిమాలన్నీ అద్భుత విజయం సాధించడంతో దర్శకనిర్మాతలు ఈమె కాల్ సీట్ల కోసం వేచి ఉండి మరి సినిమాలు తీసేవారు అని అప్పటి సినీ ప్రముఖులు చెబుతుంటారు. రాధిక దాదాపు అగ్ర హీరోలు అందరితోనూ సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకుంది.
ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఆగ్రా కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి రాధా కాంబినేషన్లో సినిమా వస్తోందంటే చాలు థియేటర్ల వద్ద అభిమానులతో సందడి వాతావరణం నెలకొనేది. వీరి కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు అద్భుత విజయం సాధించడంతోపాటు నిర్మాతలకు కనక వర్షం కురిపించాయి దాంతో వీరి కాంబినేషన్లో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు ఎంతో ఆసక్తి చూపేవారు. తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి రాధికలజంట ఎప్పటికీ ఎవరి గ్రీన్ గా నిలిచింది. రాధిక, చిరంజీవిలు ఇప్పటికీ మంచి స్నేహితులు అన్న విషయం మనందరికీ తెలిసిందే.
రాధిక అగ్ర హీరోలు అందరి సరసన నటించినప్పటికీ బాలకృష్ణ గారితో నటించకపోవడానికి కారణం చిరంజీవి గారేనని ఇండస్ట్రీలో అప్పుడప్పుడు గుసగుసలు వినిపిస్తుంటాయి. దీనికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాన్ని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ఈమంది రామారావు వెల్లడించారు. చిరంజీవి వల్లే రాధిక బాలయ్య తో కలిసి హీరోయిన్గా నటించలేదని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ఈ విషయం కేవలం పుకారు మాత్రమే అంటూ ఈ విషయంపై కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
బాలకృష్ణ సినిమాల్లోకి రాక ముందు నుంచి చిరంజీవి రాధిక కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి.
అంతకు ముందే రాధిక కృష్ణ లాంటి సీనియర్ హీరోల సరసన చాలా సినిమాల్లో నటించింది. బాలకృష్ణ సినిమాల్లో సెటిల్ అయ్యే సమయానికి విజయశాంతి సుహాసిని శ్రీదేవి లాంటి హీరోయిన్లు ఫామ్ లో ఉన్నారు. అందుకే వారితోనే ఎక్కువ సినిమాలు బాలకృష్ణ చేశారు. ఎన్టీ రామారావు శ్రీదేవి హిట్ ఫెయిర్ కావడంతో బాలకృష్ణ శ్రీదేవితో సినిమాలు చేయడానికి ఆసక్తి కనపరచలేదని చెప్పొచ్చు. అందుకే బాలకృష్ణ విజయశాంతి, రజిని ,సుహాసిని లాంటి హీరోయిన్లతోనే ఎక్కువ సినిమాలు చేశారు.