Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే కొరటాల శివ ఆచార్య సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ఆయన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ క్రమంలోనే ఈ సమయంలో ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా కోసం పూర్తిగా తన మేకోవర్ మార్చుకున్నట్లు సమాచారం.
ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం హనుమాన్ దీక్షలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష వేసుకోవడానికి గల కారణం తెలియకపోయినప్పటికీ ఎన్నో రోజుల నుంచి ఆయన హనుమాన్ మాల వేయాలని భావించారట. అయితే సరైన సమయం కుదరకపోవడంతో ఎన్టీఆర్ ఇప్పటివరకు ఎలాంటి మాల వేయలేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా విజయవంతమైన తర్వాత ఈయన హనుమాన్ దీక్ష చేస్తున్నారు.అయితే ఎన్టీఆర్ సన్నిహిత వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎన్టీఆర్ జాతకంలో దోషం ఉండటం వల్ల ఆ దోష నివారణ కోసమే ఎన్టీఆర్ హనుమాన్ మాల వేసినట్లు తెలిపారు.
సాధారణంగా ఎన్టీఆర్ రాజమౌళి సినిమా చేసిన అనంతరం తన తదుపరి చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో చేసిన సినిమాల తర్వాత ఇలాంటి చేదు అనుభవాలను ఎన్టీఆర్ ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆ దోషం తొలగిపోవడం కోసమే ఎన్టీఆర్ హనుమాన్ మాల వేసినట్లు సమాచారం.త్వరలోనే ఈ దోషం తొలగి పోవడానికి ఎన్టీఆర్ హోమం కూడా చేయనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.