Teja sajja : సూపర్ హీరోగా తేజ బ్లాకబస్టర్ కొడతాడా.. శరవేగంగా హనుమాన్ షూటింగ్…!

 

Teja Sajja: చైల్డ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు తేజ సజ్జ. చైల్డ్ ఆర్టిస్ట్ గా నే కాకుండా హీరో గా కూడా తన సత్తా చాటుకుంటున్నాడు. ఈ యంగ్ టాలెంటెడ్ హీరో, క్రియేటివ్ దర్శకుడైన ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో పాన్-ఇండియన్ సూపర్ హీరో చిత్రం హను- మాన్ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తి కావస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే నూరవ రోజు అవడంతో ఇటీవల చిత్రబృందం 100వ రోజు షూటింగ్ వేడుకలను జరుపుకుంది.

ఈ సినిమాలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా  నటిస్తోంది.ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సీనియర్ స్టార్స్, టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ దీనికి సహకరిస్తున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ కూడా కీలక పాత్ర పోషిస్తోంది.అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్, కృష్ణ సౌరభ్ వంటి ప్రతిభావంతులైన స్వరకర్తలు ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్‌లను అందిస్తున్నారు.

సినిమా కోసం పనిచేసిన దాదాపు అందరు నటీనటులు, సాంకేతిక సిబ్బంది సవాలుగా తీసుకుని కృషి చేశారు. సూపర్ హీరో సినిమాల్లో అధిక యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. అదీకాక సూపర్ హీరో కొన్ని క్లిష్టమైన విన్యాసాలు చేస్తారు. హీరోకి ఎలాంటి డూప్‌లు లేకుండా వీటిని షూట్ చేస్తున్నారట.ఇప్పటికే విడుదలైన హను-మాన్ ప్రోమోల భారీ రెస్పాన్స్ ను అందుకున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన నాన్-థియేట్రికల్ బిజినెస్ కూడా జరిగి పోయిందట. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.