Gallery

Home News ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చందంటే .. క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్ ..?

ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చందంటే .. క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్ ..?

టాలీవుడ్ లో గబ్బర్ సింగ్ సినిమా లో హీరోయిన్ గా నటించిన తర్వాత శృతిహాసన్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమాకి ముందు సక్సస్లు లేక ఇబ్బందుల్లో ఉన్న శృతి హాసన్ కి గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ అవడం తో ఇటు తెలుగు అటు తమిళ సినిమాలలో వరసగా అవకాశాలు వచ్చాయి. తెలుగులో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రాం చరణ్, మహేష్ బాబు, ఎన్.టి.ఆర్, రవితేజ లాంటి వాళ్ళ సరసన నటించి సూపర్ హిట్స్ అందుకుంది.

Krack Poster: Birthday Girl Shruti Haasan Looks Drop Dead Gorgeous In A  Desi Avatar From Ravi Teja'S Action Thriller

అంతేకాదు కోలీవుడ్ లో కూడా సూర్య, ధనుష్, విశాల్, అజిత్, విజయ్ లాంటి సూపర్ స్టార్స్ కి జంటగా నటించి సూపర్ హిట్స్ అందుకుంది. అలాగే బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ లాంటి హీరోల సినిమాలలో కూడా నటించింది. కాగా శృతీ హాసన్ గత రెండు మూడేళ్ళుగా సినిమాల పరంగా బ్రేక్ వచ్చింది. అయితే ఆ బ్రేక్ కి కారణం తను నటించిన సినిమాలు వరసగా ఫ్లాపవడం అని కొందరు.. అలాగే వేరే కారణాలున్నాయని కొందరు మాట్లాడుకున్నారు. కాని అసలు విషయం చెప్పి రూమర్స్ కి చెక్ పెట్టడమే కాకుండా గాసిప్స్ రాసే వాళ్ళకి సరైన సమాధానం చెప్పింది.

వాస్తవానికి శృతిహాసన్ సినిమాల పరంగా ఎలాంటి బ్రేక్ తీసుకోలేదట. మల్టీ టాలెంటెడ్ అయిన శృతిహాసన్ సింగర్, మోడల్, రచన, పెయింటింగ్, సంగీతం.. ఇలా పలు విభాగాలలో బిజీగా ఉంటుంది. అయితే ఒక్కో సమయంలో ఒక్కో విభాగానికి బ్రేక్ తీసుకుంటుందట. ఆ రకంగా రెండేళ్ళు సినిమాలకి బ్రేక్ ఇచ్చినట్టు క్లారిటీ ఇచ్చింది. కాగా ప్రస్తుతం శృతిహాసన్ రవితేజ నటిస్తున్న క్రాక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ లోనూ ఒక గెస్ట్ రోల్ లో కనిపించబోతుండగా మూడవసారి పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది.

 

- Advertisement -

Related Posts

Walking: ఆరోగ్యానికి ‘వాకింగ్’..! ఎంతసేపు, ఎంత దూరం, ఎలా నడవాలి..? సూచనలివే..

Walking: వాకింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని గతంలోనూ డాక్టర్లు చెప్పిన విషయమే. కాకపోతే.. ప్రస్తుత కరోనా సమయంలో వాకింగ్ ప్రయోజనాలు బాగా తెలిసొచ్చాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుకుంటే కరోనా ఒక్కటే కాదు.....

భారతరత్నమే.. సోనూ సూద్‌కి డబ్బులెలా వస్తున్నాయ్.?

ఎవరన్నా సాయం అడిగితే చాలు, 'మీరేం ఆందోళన చెందాల్సిన పనిలేదు.. మీ సమస్య తీరిపోతుంది..' అని భరోసా ఇస్తున్నాడు సోనూ సూద్. ఇదెలా సాధ్యమవుతోంది.? ప్రభుత్వాలు చెయ్యలేని పనిని, సోనూ సూద్ ఎలా...

వైజాగ్ నాట్ ఫర్ సేల్.! స్టీల్ ప్లాంట్ సంగతేంటి.?

విభజన గాయాల నుంచి ఇంకా ఆంధ్రపదేశ్ రాష్ట్రం కోలుకోలేదు. ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూనే వుంది. కేంద్రం నుంచి తగిన సాయం అందకపోవడంతో, అప్పులు చేయడం తప్ప రాష్ట్రాన్ని నడిపేందుకు ప్రభుత్వాలకు మరో మార్గం...

Latest News