ప్రబాస్ సరసన శ్రీలీల అంటూ తాజాగా ఓ గాసిప్ జోరందుకుంది ఇటీవల. అంతలోనే ఆ గాసిప్‌కి చెక్ పడిపోయింది. హను రాఘవపూడి, ప్రబాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల అంటూ ప్రచారం జరిగింది. అవును నిజమే.. ప్రస్తుతం వున్న క్రేజీ హీరోయిన్లలో శ్రీలీల టాప్ చెయిర్ అధిరోహించేసింది. అలాగని రష్మిక మండన్నా.. పూజా హెగ్ధే తదితర ముద్దుగుమ్మలు వెనకడుగు వేశారని కాదండోయ్.
వాళ్లకుండే స్టార్‌డమ్ అలాగే వుంది. అయితే, ఎటు వైపు నుంచి విన్నా శ్రీలీల పేరే వినిపిస్తుండడంతో ఈ గాసిప్‌కి ప్రాణ ప్రతిష్ట జరిగిపోయిందలా అంతే. కానీ, అది వుత్త గాసిప్ మాత్రమే. అందులో నిజం లేదంటున్నారు హను రాఘవపూడి సన్నిహితులు.
ప్రబాస్‌తో తాను తెరకెక్కించబోయే ప్రాజెక్ట్‌లో శ్రీలీల పేరు జోడించలేదనీ.. తనకా వుద్ధేశ్యమే లేదనీ హను రాఘవపూడి తన సన్నిహితుల వద్ద వాపోతున్నాడట.
ఈ ప్రాజెక్ట్‌లో ఇద్దరు ముద్దుగుమ్మలు నటించబోతున్నారనీ తెలుస్తోంది. అందులో ఒకరు మృణాల్ ఠాకూర్ అని ఓ టాక్ వినిపిస్తోంది. హను రాఘవపూడి తెరకెక్కించిన ‘సీతారామం’ సినిమాలో మృణాల్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే.
ఆ సినిమా రిజల్ట్‌తో సెంటిమెంట్ పరంగా వర్కవుట్ అవుతుందని ఆమె పేరు హోల్డ్‌లో పెట్టి వుంచాడట హను రాఘవపూడి. మరో భామ కోసం బాలీవుడ్‌లో పరిశీలిస్తున్నారట. కుదిరితే, రష్మిక, పూజా హెగ్ధే వంటి అక్కడా ఇక్కడా క్రేజ్ వున్న ముద్దుగుమ్మల పేర్లను సైతం పరిశీలిస్తున్నాడట కానీ, శ్రీలీల పేరు అస్సలు పరిశీలనలో లేదనీ తెలుస్తోంది.