వచ్చి వారం దాటింది.. సోలో బ్రతుకే సొ బెటరు హిట్టా ప్లాపా ? ఇదే ఇప్పుడు కొంతమంది హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు. దాదాపు 8 నెలల తర్వాత థియేటర్స్ లో వచ్చిన మొదటి తెలుగు సినిమా సోలో బ్రతుకే సో బెటర్. మెగా హీరో సాయి ధరం తేజ్ హాట్ బ్యూటీ నభా నటేష్ జంటగా నటించారు. నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కింది. అందరు టాలీవుడ్ హీరోలు థియేటర్స్ లో 50 పర్సెంట్ ఆక్యుపెనీ తో వసూళ్ళు రావని, పెట్టిన బడ్జెట్ తిరిగి వస్తుందా లేదా అన్న సందేహంతో రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు.
ఇలాంటి సమయంలో మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తన సోలో బ్రతుకే సో బెటర్ తో డిసెంబర్ 25 న థియేటర్స్ వచ్చి హిట్ టాక్ ని తెచ్చుకుంది. యూత్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాబోతుందనగానే విశ్లేషకులు పెద్దగా లాభాలు వచ్చే అవకాశం లేదని అసంతృపిని వ్యక్తం చేశారు. కాని కేవలం 8 రోజుల్లోనే వసూళ్ళలో మేకర్స్ అనుకున్న టార్గెట్ ని రీచ్ అయిందని ఇకపై వచ్చేదంతా ప్రాఫిట్ అని ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
ఇలాగే సంక్రాంతి వరకు కంటిన్యూ అయితే భారీగా లాభాలు వచ్చినట్టే అని చెప్పుకుంటున్నారు. మొత్తానికి సోలో బ్రతుకే సో బెటర్ సాయి ధరం తేజ్ నమ్మకాన్ని నిలబెట్టింది. మేకర్స్ కి లాబాలు తెచ్చి పెట్టింది. దీంతో ఇప్పుడు సంక్రాంతి బరిలో దిగబోతున్న మాస్ మహారాజ రవితేజ క్రాక్ .. రాం రెడ్ .. రానా అరణ్య సినిమాల మీద అంచనాలు భారీగా పెరిగాయి. అంతేకాదు ఇప్పటి నుంచే ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయబోతున్నాయో లెక్కలు వేసుకుంటున్నారు. చూడాలి మరి సంక్రాంతి బరిలో ఎవరు ఎంత వసూళ్ళు రాబట్టి రికార్డ్ ని క్రియేట్ చేస్తారో.