హీరోయిన్ కలర్ స్వాతి ఇండస్ట్రీకి దూరం కావటానికి ఆమె కారణమా?

సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే హీరో హీరోయిన్లుగా రాణించాలంటే అందం చాలా అవసరం. అయితే అందంతో పాటు తెలివితేటలు అదృష్టం ఉంటేనే ఇండస్ట్రీలో కొనసాగుతారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం ఎంత కష్టమో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటం కూడా అంతే కష్టం. ఇలా వచ్చిన అవకాశాలు వదులుకోవడం వల్ల ఎంతోమంది హీరోయిన్లు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా హీరోయిన్ గా గుర్తింపు పొంది ఇండస్ట్రీకి దూరమైన వారిలో కలర్ స్వాతి కూడా ఒకరు.

మొదట కలర్స్ షో లో యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన స్వాతి హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. ఎన్నో మంచి సినిమాలలో నటించి హీరోయిన్ గా గుర్తింపు పొందింది. కెరీర్ ప్రారంభంలో ఎంతో క్యూట్ గా కనిపించిన స్వాతి రాను రాను తన అందం మీద శ్రద్ద తగ్గించింది. దీంతో స్వాతీ బాడీలో మార్పులు వచ్చాయి. ఫేస్ ముదిరిపోయిన్నట్లు అయ్యి పెద్ద మనిషిలా కనిపిస్తూ వచ్చేది. అందువల్ల అమెకు సినిమా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఈ క్రమంలో స్వాతి పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. అందం గురించి స్వాతి తగిన జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఇండస్ట్రీలో సెకండ్ హీరోయిన్ గా అయినా అవకాశాలు దక్కించుకునేది.

అంతేకాకుండా హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన సమయంలో కథని ఎన్నుకొనే విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మంచి మంచి సినిమా ఆఫర్స్ ను చేతులారా వదిలేసుకుంది. స్వాతి చేసిన ఈ రెండు పొరపాట్ల వల్ల ఆమెకు కెరియర్ లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు కేవలం ఇంటికి పరిమితం అయింది. అయితే చాలామంది హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంబించి కీలక పాత్రలలో నటిస్తున్నారు. కలర్ స్వాతి కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి మళ్ళీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తుందో? లేదో? చూడాలి మరి.