Big Boss Non Stop: 10వ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు రానున్న కంటెస్టెంట్ ఆమె?

Big Boss Non Stop: బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ కార్యక్రమం మరికొన్ని వారాలలో ముగియనుంది. ఇప్పటికే పది వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మరో రెండు వారాలలో పూర్తి అవుతుందని తెలుస్తుంది.ఇకపోతే 10వ వారం పూర్తి కావడంతో ఈ వారం తప్పనిసరిగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. ఇకపోతే ఈ వారం బాబా భాస్కర్ మాస్టర్, నటరాజ్ మాస్టర్ మినహా మిగిలిన కంటెస్టెంట్ లు అందరూ కూడా నామినేషన్ లో ఉన్నారు.ఈ క్రమంలోనే ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎవరు బయటకు వెళ్లనున్నారు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్ ఎవరో ముందు రోజే తెలిసిపోతుంది. ఈ క్రమంలోనే ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో నుంచి ఎవరు బయటకు రానున్నారనే విషయం గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో నుంచి ఎవరు బయటకు రానున్నారనే విషయానికి వస్తే.. ఎప్పటిలాగే బిందుమాధవి అఖిల్ ఓటింగ్ లో ముందు వరుసలో ఉన్నారు. వీరి తర్వాత యాంకర్ శివ,మిత్రశర్మ ఓట్లలో ముందంజలో ఉన్నారు. డేంజర్ పొజిషన్లో అనిల్, అరియనా, ఆశు రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ ముగ్గురిలో ఎవరు ఈ వారం బయటికి రానున్నారు అని ఆతృతతో అందరిలో నెలకొంది. ఓటింగ్ ప్రకారం చూసుకుంటే అందరికన్నా అషు రెడ్డి చాలా తక్కువ ఓట్లను సంపాదించుకున్నట్లు తెలుస్తోంది. కాబట్టి 10వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఆశు రెడ్డి బయటకి రానున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే ఈ వారం ఆశు రెడ్డి బయటకు రానున్నారా లేదా అనే విషయం మరి కొన్ని గంటలలో తెలియనుంది.