వరసగా ఫ్లాపులు రావడం కారణంగా మాస్ మహారాజా రవితేజ లో కసి పెరిగిందా.. తాజాగా ఆయన కమిటయిన ప్రాజెక్ట్స్ చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజా గా క్రేజ్ ని సంపాదించున్నాకుడు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగిన రవితేజ కి ఒక సపరేట్ మార్కెట్ ఏర్పడింది. రవితేజ సినిమాలకి బాక్సాఫీస్ వద్ద మాస్ ఆడియన్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. అయితే గత కొంతకాలంగా రవితేజ టైం అసలు బావుండటం లేదన్న టాక్ వినిపిస్తోంది.
రాజా ది గ్రేట్ సినిమా తప్ప మళ్ళీ రవితేజ అకౌంట్ లో ఇప్పటి వరకు సాలీడ్ హిట్ పడలేదు. అయితే ఎప్పుడు రవితేజ నుంచి ఏడాదికి కనీసం 2 సినిమాలైన వచ్చేలా ప్లాన్ చేసుకుంటాడు. కానీ ఈ సంవత్సరం కరోనా లాక్ డౌన్ కారణంగా ‘డిస్కో రాజా’ సినిమా ఒక్కటే రిలీజైంది. ఆ సినిమా కూడా ఫ్లాప్ గా మిగిలింది. దాంతో హిట్ కొట్టాలన్న కసి పెరిగిన రవితేజ వరసగా సినిమాలు కమిటయ్యాడు. అంతేకాదు ఈ సినిమాలలో కనీసం 3 సినిమాలు 2021 లో రిలీజ్ అయ్యేలా హార్డ్ వర్క్ చేస్తున్నాడట.
ఇప్పటికే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన ‘క్రాక్’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారకంగా కూడా ప్రకటించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ సముద్రఖని కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆర్జీవీ అప్సర రాణి స్పెషల్ సాంగ్ లో రవితేజ తో కలిసి స్టెప్పులేసింది. ఈ సాంగ్ కి మంచి బజ్ కూడా క్రియేటయింది. ఇక రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ అన్న సినిమా చేస్తుండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ సినిమాని 2021 దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అలాగే త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కూడా 2021 ఎండింగ్ లోపు రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడట. ఇక మరికొన్ని ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడని వాటిలో యూవీ క్రియేషన్స్ లో నిర్మించే ప్రాజెక్ట్ కూడా ఉందని సమాచారం. మొత్తానికి 2021 లో మాత్రం రవితేజ నుంచి ఖచ్చితంగా 3 సినిమాలు రానున్నాయని అర్థమవుతోంది.