ఎన్టీయార్‌ని రామ్ చరణ్ ర్యాగింగ్ చేస్తున్నాడా.?

‘ఆస్కార్’ గాలి సోకిన తర్వాత, రామ్ చరణ్ పేరు మర్చిపోయాడు జూనియర్ ఎన్టీయార్. తన ట్వీట్లలోగానీ, తన మాటల్లోగానీ జూనియర్ ఎన్టీయార్ ఎక్కడా రామ్ చరణ్ ప్రస్తావన తీసుకురావడంలేదు. దర్శకుడు, సంగీత దర్శకుడు.. ఇలా అందరి పేర్లూ చెప్పి, చరణ్ పేరుని ఎన్టీయార్ ఎందుకు విస్మరిస్తున్నట్లు.?

ఈ విషయమై చరణ్ ఫ్యాన్స్ చాలా గుస్సా అవుతున్నారు. ఎన్టీయార్ అభిమానులైతే చరణ్‌ని సైడ్ యాక్టర్ అంటున్నారు. కానీ, రామ్ చరణ్ మాత్రం ‘మై బ్రదర్ తారక్..’ అంటూ అదే ప్రేమాభిమానాల్ని కొనసాగిస్తున్నాడు. మామూలుగా అయితే, చరణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్టీయార్ ప్రస్తావన తీసుకురాకూడదు.

కానీ, చరణ్ అలా చేయడంలేదు. తారక్‌తో స్నేహాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఇదంతా రామ్ చరణ్ మార్క్ ర్యాగింగ్ అని జూనియర్ ఎన్టీయార్ అభిమానులే మరింత అసహనానికి లోనవుతున్నారు. అయినా, ‘ఆర్ఆర్ఆర్’ హీరోల మధ్య అనూహ్యంగా ఎందుకీ పంచాయితీ.?