Ram Pothineni: రామ్ బోయపాటి సినిమా పొలిటికల్ డ్రామానా….?

 

Ram Pothineni: ఎనర్జిటిక్ హీరో పోతినేని రామ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శీను కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం సినీ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టురి ఈ సినిమాని నిర్మించనున్నారు. బోయపాటి శీను ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇకపోతే పోతినేని రామ్ ప్రస్తుతం లింగస్వామి దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా రానున్న ‘ ది వారియర్ ‘ సినిమాలో నటిస్తున్నారు.

బోయపాటి శ్రీను ఈ సినిమాని హై వోల్టేజ్ యాక్షన్ సినిమాగా రూపొందించనున్నారని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. బోయపాటి శ్రీను ఈ సినిమాని పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీస్తున్నారని, సినిమాకు సంబంధించిన కథ మొత్తం ఇద్దరు అన్నదమ్ముల మధ్య వారి గొడవలకు సంబంధించి ఉంటుందని భోగట్టా.

బోయపాటి శ్రీను రామ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు హీరోయిన్ గా చిత్ర బృందం బాలీవుడ్ బ్యూటీ అయిన పరిణీతి చోప్రాను కూడా సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్ పరిణితి మధ్యలో అందమైన రొమాంటిక్ లవ్ స్టోరీ ని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పరిణితి చోప్రా కూడా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రను ఇష్టపడి నట్టు సమాచారం.