మళ్లీ అదే చర్చ.! రాజమౌళి చేసుంటేనా.?

‘ప్రాజెక్ట్ కె’ సినిమాకి తాజాగా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ‘కల్కి 2898ఏడీ’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. వ్యూస్ రికార్డు స్థాయిలో వచ్చేస్తున్నాయ్. అహో అద్భుతం.. ఓహో అద్భుతం.. అనేస్తున్నారు. కానీ, ఇదే సినిమాని రాజమౌళి చేసుంటేనా.? అనే కొత్త చర్చ తెరపైకొచ్చింది.

ప్రబాస్‌కి ‘బాహుబలి’ సినిమా తర్వాత ఆ స్థాయి హిట్టు దక్కిందే లేదు. ఇంత గొప్ప.! అంత గొప్ప..! అంటూ అబ్బో భారీ బడ్జెట్ సినిమాలే వస్తున్నాయ్ ప్రబాస్ మీద. కానీ, పేరు గొప్ప ఊరు దిబ్బ అనే స్థాయిలో వుంటున్నాయవన్నీ. దాంతో, రాజమౌళి గురించిన చర్చ సరికొత్తగా తెరపైకి వచ్చింది.

ప్రబాస్‌కి మళ్లీ ఆ హిట్ ఇవ్వదగ్గ దర్శకుడు కేవలం రాజమౌళియేనా.? అని మాట్లాడుకుంటున్నారు. కానీ, అది సాధ్యమేనా.? ప్రబాస్ కెరీర్‌కి రాజమౌళి అడ్డంకిగా మారాడా.? అనే అనుమానాలు తలెత్తుతున్నాయ్.

ఇక, తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్ విషయానికి వస్తే, వ్యూస్ వస్తున్నా.. ఫ్యాన్స్ ఏ మాత్రం సంతృప్తికరంగా లేరు.