గోపీకృష్ణా మూవీస్ బ్యానర్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా రాధేశ్యాం. కృష్ణం రాజు కుమార్తె ప్రశీద ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుంది. డార్లింగ్ ప్రభాస్ – పూజా హెగ్డే హీరో, హీరోయిన్స్ గా జిల్ ఫేం రాధాకృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. పిరియాడిక్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ ఇటలీకి వెళ్ళిన సంగతి తెలిసిందే.
అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ ముందే జార్జియాలో షూట్ కోసం వెళ్ళిన రాధేశ్యాం బృందం… కరోనా వైరస్ విజృంభణ తో తిరిగి మళ్ళీ వెనక్కు వచ్చేశారు. కాగా పరిస్థితులు చక్కబడటంతో మళ్ళీ యూనిట్ అంతా 15 రోజుల షెడ్యూల్ కోసం ఇటలీ వెళ్లారు. కాగా అనూహ్యంగా అక్కడ కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలవడంతో అక్కడ ప్రభుత్వం మళ్ళీ లాక్ డౌన్ ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.
దాంతో రాధే శ్యాం యూనిట్ అంతా మళ్ళీ షూటింగ్ ఆపేసి వెనక్కి వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా యూనిట్ అంతా రిటన్ ఫ్లైటెక్కారన్న వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం మేరకు అక్కడ కరోనా వైరస్ విజృంభణ ఉన్నప్పటికి షూటింగ్ మాత్రం జరుగుతుందట. షెడ్యూల్ ప్రకారమే చిత్రీకరణ జరుగుతున్నట్టు సమాచారం.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్ని కేవలం రూమర్సే అని అంటున్నారు. కాని గత కొన్ని రోజులుగా ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి ఈ రూమర్స్ రాధే శ్యాం సినిమా ప్రమోషన్స్ కి బాగా ఉపయోగపడిందని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమా కి జెస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తుండగా సమ్మర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.