అసలు ప్రభాస్‌కి ఏమయ్యింది.? ‘సలార్’ సినిమాలో ప్రభాస్‌ని చూసినవాళ్ళంతా, ‘డాన్సులు వేయగలడు కదా.. సిట్యుయేషనల్ సాంగ్ ఏదైనా డిజైన్ చేసి వుండాల్సింది. ఫైట్స్‌లో ఇంకాస్త ఎనర్జిటిక్‌గా ప్రభాస్‌ని చూపించి వుండాల్సింది..’ అనే అనుకున్నారు.
ఎక్కడా ఆ చాన్సే ఇవ్వలేదు ప్రశాంత్ నీల్, ప్రభాస్‌కి. అంతేనా.? ఇతరత్రా సమస్యల కారణంగా ప్రభాస్ స్వయంగా బద్దకించేశాడా.? ‘ఆదిపురుష్’ సినిమాకి కూడా ప్రభాస్ పెద్దగా కష్టపడిందేమీ లేదు.
గత కొంతకాలంగా ప్రభాస్, కాలి నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆ కారణంగానే, దర్శకులు చాలా జాగ్రత్తలు తీసుకుని, ప్రభాస్‌తో సినిమాల్ని ‘మమ’ అనిపించేస్తున్నారు.
కానీ, ముందు ముందు అలా కుదరదు. అందుకే, ఇటీవల సర్జరీ చేయించుకున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ ఎలా వున్నట్టు.? అదైతే సస్పెన్స్. మనిషి బాగానే వున్నాడు.. ఆ కటౌట్ తీరే వేరు.!
మునుపటిలా ప్రభాస్ నుంచి డాన్సులు, రిస్కీ యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ చూడగలమా.? అసలు ప్రభాస్ సెట్టయ్యాడా.? లేదా.? ఈ డౌటానుమానాలకు నివృత్తి ఎప్పుడో మరి.!