పూజా హెగ్డే ఆ హీరోతో ప్రేమలో ఉందా.. చక్కర్ల కొడుతున్న క్రేజీ న్యూస్?

ముకుంద సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన పూజా హెగ్డే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకొని తన అందం, అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని స్టార్ హీరోయిన్గ గుర్తింపు పొందింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో మాత్రమే కాకుండా అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. హిట్ ప్లాఫ్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండే పూజా హెగ్డే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కాలికి గాయం అవ్వటం వల్ల కొంతకాలంగా ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న పూజా హెగ్డే ప్రేమ వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

సౌత్ నార్త్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన పూజా హెగ్డే గత కొంతకాలంగా తన బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. బాలీవుడ్ మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. అనారోగ్యంతో బాధపడుతున్న పూజా హెగ్డే ని తన బాయ్ ఫ్రెండ్ దగ్గరుండి మరి చూసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి పూజ హెగ్డే హాస్పిటల్ లో సందడి చేసినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకాలం తన ప్రేమ వ్యవహారం సీక్రెట్ గా ఉంచిన పూజా హెగ్డే ఇప్పుడు ఆమె అనారోగ్యం కారణం వల్ల బయటపడిందని వార్తలు వినిపిస్తున్నాయి.

చాలాకాలంగా ప్రియుడితో డేటింగ్ లో ఉన్న పూజ హెగ్డే తొందర్లోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. వీరి ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు అంగీకారం తెలపటంతో తొందర్లోనే పూజా హెగ్డే తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే పూజ హెగ్డే స్పందించాల్సి ఉంటుంది. ఇక పూజ హెగ్డే సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల వరుస ప్లాఫ్ లు అందుకున్న పూజ ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు హిందీ లో కూడా రెండు సినిమాలలో నటిస్తున్నట్లు సమాచారం.