పవన్ కళ్యాణ్.! ఆ రెండు మాత్రమేనా.?

అదేంటీ, రెండు సినిమాలు మాత్రమేనా.? ఇంకో రెండు అటకెక్కినట్లేనా.? మరి, ఇంకో సినిమా గురించిన గాసిప్స్ ఎందుకు వినిపిస్తున్నట్లు.? అంతా గందరగోళం.! దటీజ్ పవన్ కళ్యాణ్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ వ్యవహారాల్లో తలమునకలై వున్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ ఈ నెలలో పునఃప్రారంభం కావాల్సి వుండగా, ఆ అవకాశాలైతే కన్పించడంలేదు.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఇకపై సినిమాల షూటింగులకు పవన్ కళ్యాణ్ డేట్లు కేటాయించడం దాదాపు అసాధ్యమేనట. అంటే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రస్తుతానికి తాత్కాలికంగా వాయిదా పడ్డట్టే. ‘బ్రో’ ఎలాగూ పూర్తయిపోయింది.

‘ఓజీ’ ఎలాగోలా పూర్తి చేసేస్తారట. మధ్యలో కొత్త సినిమా అయితే సెట్స్  మీదకు రావొచ్చనీ, సాధ్యాసాధ్యాల్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పరిశీలిస్తున్నాడనీ అంటున్నారు. మరి; హరీష్ శంకర్ పరిస్థితేంటి.? పవన్ కళ్యాణ్ నుంచి ‘మాట’ కోసం ఆయన ఎదురుచూస్తున్నాడట. తప్పదు మరి.! వేరే ఛాన్స్ లేదు.!