పవన్ కళ్యాణ్ బ్రో థీమ్ కూడా కాపీనా?

టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న ఎస్ ఎస్ తమన్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ట్రోల్స్ పేస్ చేస్తూ ఉంటాడనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్ విషయంలో ఎక్కువగా కాపీ మరకలు అంటించుకుంటూ ఉంటాడు. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కాపీ క్యాట్ అనే ముద్ర పడిపోయింది.

తమన్ స్వరపరిచిన సాంగ్స్ మ్యూజిక్ లేదంటే సాంగ్ లైన్స్ చాలా వరకు ఇంకెక్కడో అప్పటికే ఉంటాయి. వాటిని కాస్తా అటుఇటు మార్చేసి తన సినిమాలకి వాడేసుకుంటాడు అనే కామెంట్స్ నిత్యం తమన్ యాంటీ ఫ్యాన్స్ చేస్తూ ఉంటారు. కంపారిజన్ వీడియోలు పెట్టి మరీ మీమ్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేస్తారు. రీసెంట్ గా రామ్ పోతినేని, బోయపాటి ఫస్ట్ థండర్ విషయంలో కూడా కాపీ ఆరోపణలు ఎదుర్కొన్నాడు.

ఇదిలా ఉంటే సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించిన టైటిల్ మోషన్ పోస్టర్ ని తాజాగా ఆవిష్కరించారు. ఈ మోషన్ పోస్టర్ కోసం థీమ్ సాంగ్ ని తమన్ డిజైన్ చేశాడు. వినడానికి ఆద్యాత్మిక కోణంలో రుద్రుడిని ఆరాదిస్తున్నట్లు ఈ స్త్రోత్రమ్ ఉంది. అందరికి భాగా కనెక్ట్ అయ్యింది.

బ్రో టైటిల్ ని ఈ మూవీకి ఫిక్స్ చేశారు. అయితే ఈ బ్రో టైటిల్ మోషన్ పోస్టర్ కి వాడిన థీమ్ సాంగ్ పైన ఇప్పుడు కాపీ ఆరోపణలు వస్తున్నాయి. అక్షయ్ కుమార్ బ్లూ మూవీ సాంగ్ ట్యూన్ తీసుకొని దానిని కొద్దిగా మార్చి బ్రో థీమ్ సాంగ్ గా వాడేశాడు అంటూ సోషల్ మీడియాలో రెండు సినిమాల సాంగ్స్ ని ఒకే వీడియో పెట్టి ఆడేసుకుంటున్నారు.

మొత్తానికి ఈ ఏడాదిలో తమన్ నుంచి వచ్చిన వీరసింహారెడ్డిలో జై బాలయ్య సాంగ్ ని డైరెక్ట్ గా ఒసేయ్ రాములమ్మ సాంగ్ ట్యూన్, లైన్స్ ఆర్డర్ లేపేసి వాడేశాడు. ఈ విషయాన్ని అతను కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడు రామ్ పోతినేని మూవీతో పాటు పవన్ కళ్యాణ్ మూవీ బ్యాగ్రౌండ్ థీమ్ సాంగ్స్, ఎలివేషన్ మ్యూజిక్ కాపీ అంటూ ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై తమన్ ఎలాంటి క్లారిటీ ఇస్తాడో చూడాలి.