ఎన్టీఆర్ – త్రివిక్రమ్ చిత్రంలో `అల..` టైపులో రోల్ రిపీట్ చేస్తున్నారా?  పూజాకు మ‌రోసారి జాక్ పాట్ త‌గిలిన‌ట్టేనా?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలయికలో వచ్చిన `అరవింద సమేత` చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసినదే. ఇదే కలయికలో ఇప్పుడు మరొక చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌నుంది. RRR చిత్రం తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోయే చిత్రమిది. హారిక హాసిని మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ల పై స్. రాధాకృష్ణ (చినబాబు) – నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు సాగుతున్నాయి. ఈ చిత్రం వేసవి నుండి షూటింగ్ కు వెళ్లాల్సి ఉండ‌గా కరోనా వ‌ల్ల వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.

is ntr role in avp movie repeated again?
is ntr role in avp movie repeated again?

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రాన్ని 2021 వేసవి కి విడుదలకు ఛాన్స్ లేద‌ని చిత్ర బృందం భావిస్తోంద‌ట‌. ఇప్ప‌టికే డిలే అయ్యింది కాబ‌ట్టి.. ఆర్.ఆర్.ఆర్ వ‌ర్గాల నుంచి క్లారిటీ లేక త‌దుప‌రి ప్లానింగ్ చేయ‌నున్నార‌ని తెలిసింది. ఈ సినిమాలో నటీ నటుల  సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో  రివీల్ చేయ‌నున్నార‌ట‌.

అయితే ఈ మూవీలో కూడా గురూజీ త్రివిక్ర‌మ్ అల టైపు పాత్ర‌ను రిపీట్ చేస్తార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. త్రివిక్ర‌మ్ ప్ర‌తి సినిమాలోనూ నాయికా ప్రాధాన్య‌త ఉంటుంది కాబ‌ట్టి త‌దుప‌రి ఎన్టీఆర్ సినిమాలోనూ హీరో పాత్ర‌కు ధీటుగా ఆ రోల్ రాస్తున్నార‌ట‌. అయితే ఇంకా క‌థానాయిక‌ను ఫైన‌ల్ చేయాల్సి ఉంది. గురూజీ మైండ్ లో న‌లుగురి పేర్లు ఉన్నాయి. పూజా హెగ్డే పేరు ప్ర‌ముఖంగా వినిపించినా.. ర‌ష్మిక మంద‌న‌.. శ్రుతిహాస‌న్.. స‌మంత పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే  పూజా.. స‌మంత‌ల‌తో ప‌ని చేసారు కాబ‌ట్టి ర‌ష్మిక‌కు కానీ.. శ్రుతికి కానీ ఛాన్సుంటుందా? అన్న‌ది చూడాలి. ఇక అల టైపులో రోల్ అంటే జాక్ పాట్ కొట్టిన‌ట్టే. ఆ ముద్దుగుమ్మ ఎవ‌రో మ‌రి?