టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ ఇప్పుడు సినిమాలకంటే ఎక్కువగా వెబ్ సిరీస్ కే ఇంపార్టెన్స్ ఇస్తుందని అందరూ మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ నటించిన మిషన్ మంగళ్ అన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చింది నిత్యా. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో వెంటనే బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ నటించిన సక్సస్ ఫుల్ వెబ్ సిరీస్ బ్రీత్ ఇన్ టు ద షాడోస్ సీజన్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ లో నిత్యా అభిషేక్ బచ్చన్ ని మించి పర్ఫార్మెన్స్ చేసి ఆకట్టుకుంది. ఈ వెబ్ సిరీస్ లో మరొక అమ్మాయితో కలిసి లిప్ లాక్ కూడా చేసింది.
అలా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలా అయినా నటించడానికి సిద్దంగా ఉంటుంది. కాగా తాజాగా నిత్యా మీనన్ మరో వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ లో నిత్యా దే ప్రధాన పాత్ర అని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ నిర్మించనున్నారు. స్వప్న దత్, ప్రియాంక దత్ కలిసి నిర్మించే ఈ వెబ్ సిరీస్ 8-ఎపిసోడ్స్ రూపొందనుండగా డిసెంబర్ లేదా జనవరి నుండి షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు. కాగా ప్రముఖ రచయిత బలభద్రపాత్రుణి రమణి ఈ సిరీస్ కి కథను అందిస్తుండగా.. డెబ్యూ దర్శకుడు గోమతేష్ ఉపాధ్యాయ్ దర్శకత్వం వహించనున్నారు. అవసరల శ్రీనివాస్ దర్శకత్వ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.
అయితే వాస్తవంగా ఈ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన సావిత్రి బయోపిక్ మహానటి లో ముందు సావిత్రి పాత్ర కి నిత్యా మీనన్ నే మేకర్స్ అనుకున్నారు. కాని నిత్యా కి కుదరకపోవడం తో ఆ సినిమా చేసే అవకాశం కీర్తి సురేష్ దక్కించుకుంది. కాగా అప్పుడు మిస్ అయిన ఛాన్స్ ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ లో దక్కిందని మాట్లాడుకుంటున్నారు. ఇక అమ్మ జయలలిత బయోపిక్ ది ఐరన్ లేడీ లో నిత్యా మీనన్ జయలలిత గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే సినిమాలకంటే ఇప్పుడు వెబ్ సిరీస్ కి మండి డిమాండ్ ఉంది. ప్రేక్షకులు వాటిని చూడటానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక హీరోయిన్స్ కి కూడా భారీగా రెమ్యూనరేషన్ అందుతోంది. ముఖ్యంగా పర్ఫార్మెన్స్ కి మంచి స్కోప్ ఉంటుంది. అందుకే నిత్యా ఇప్పుడు సినిమాల కంటే కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందట.