మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం ఫులో జోష్‌లో ఉంది. ఇక సినిమాలకు పూర్తిగా దూరం అవ్వడంతో.. పర్సనల్ లైఫ్ మీదే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే కాబోయే భర్త చైతన్యతో కలిసి వ్యాయామం చేస్తూ ఫిట్ నెస్‌పై శ్రద్ద పెట్టింది. ఇక వీరిద్దరూ రోజూ జిమ్‌కు వెళ్లి బాగానే కష్టపడుతున్నారు. వీరితో పాటు లావణ్య త్రిపాఠి కూడా జాయిన్ అయినంది. ఇలా ఎంచక్కా వీరంతా జిమ్ మేట్స్ అయిపోయారు.
అయితే నిహారిక, చైతన్యలు పెళ్లి కాకపోయినా కూడా బాగానే తిరిగేస్తున్నారు. మాటముచ్చట పూర్తయ్యాకే వీరిద్దరు బయట సందడి చేయడం మొదలెట్టారు. చైతన్య బర్త్ డేకు రెస్టారెంట్‌కు వెళ్లారు. బాగానే ఎంజాయ్ చేశారు. పైగా తన ఫియాన్సీపై ఓ కవితను కూడా రాసేసింది నిహారిక. నిశ్చితార్థం రోజున వీరిద్దరి జంటను నెటిజన్లు చూసి సూపర్, వావ్ అంటూ కామెంట్లతో హోరెత్తించారు.
అయితే తాజాగా నిహారిక అర్దరాత్రి ఎటో బయల్దేరింది. కారులో ఎయిర్ పోర్ట్ వరకు బయల్దేరింది. ఆపై సేఫ్టీ మెజర్స్ తీసుకుని ఫ్లైట్‌లో కూర్చుంది. మొహానికి ఫేస్ షీల్డ్‌ను పెట్టుకున్న ఫోటోను షేర్ చేసింది. ఆ కాసేపటికి గోవాలో ఉన్నట్టుగా ఓ ఫోటోను షేర్ చేసింది. ఫస్ట్ కాఫీ తాగాల్సిందే అంటూ ఓ రెస్టారెంట్‌లో దిగిన ఫోటోను షేర్ చేసింది. అయితే ఈ ఫోటో మాత్రం సెల్ఫీ కాదు. ముందు ఎవరో కూర్చుని ఉన్నారు. వాళ్లే ఆ ఫోటోను తీసినట్టు కనిపిస్తోంది. మరి అతను తన చేయి పట్టుకుని జీవితాంతం నడిపించేవాడే అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. భర్తతో కలిసి ఇప్పుడు గోవాకు ఎందుకు వెళ్తుంది? అసలు వెళ్లింది అతనేనా? అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.