ఫ్లాపు సినిమాని రుద్దుతున్నావేంటి నాగబాబూ.?

ఇంటర్నెట్‌లో సినిమా అందుబాటులోనే వుంది. మళ్ళీ ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయడమెందుకు.? ‘ఆరెంజ్’ సినిమా గురించి అంతటా వినిపిస్తోన్న ప్రశ్న ఇది. నాగబాబు నిర్మాతగా రూపొందిన ‘ఆరెంజ్’ సినిమాలో రామ్ చరణ్, జెనీలియా హీరోయిన్లు. చాలా పెద్ద డిజాస్టర్ ఈ సినిమా.

అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఆత్మహత్యాయత్నం కూడా చేసేదాకా వెళ్ళానని నాగబాబు స్వయంగా చెప్పుకున్నారు. చరణ్ నటించిన సినిమా, నాగబాబు నటించి నిర్మించిన సినిమా.. కానీ, ఆర్థిక ఇబ్బందులేమో పవన్ కళ్యాణ్‌కి. ‘ఆరెంజ్’ అప్పుల్ని పవన్ కళ్యాణ్ తీర్చాడు, నాగబాబుని గట్టున పడేశాడు.

ఆ పీడకల.. ఇప్పుడిలా థియేటర్లలో ఎందుకు.? పైగా, జనసేన కోసం వినియోగిస్తారట, ‘ఆరెంజ్’ ప్రత్యేక ప్రదర్శన ద్వారా వచ్చే సొమ్ముల్ని. ఇది మరీ టూమచ్ కదా.? అభిమానుల సెంటిమెంట్లతో ఆడుకోవడం తగదు నాగబాబూ.. అని సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.