కియారా అద్వాని టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తర్వాత కియారా బోయపాటి శ్రీను – రాం చరణ్ కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ సినిమా చేసింది. ఆ తర్వాత తెలుగు సినిమాలు చేసే తీరిక లేనంతగా బాలీవుడ్ లో సెటిలై పోయింది.
‘పగ్లీ’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రి ఇచ్చిన కియారా ఆ తర్వాత ‘ఎం.ఎస్.ధోని’ సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత లస్ట్ స్టోరీస్ అన్న వెబ్ సిరీస్ అలాగే తెలుగు లో వచ్చి సూపర్ హిట్ సాధించిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా క్రేజ్ ని సంపాదించుకుంది. అయితే సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా క్రేజీ స్టార్స్ కి సంబంధించిన విషయాలలో మీడియా చాలా రకాలుగా ప్రచారం చేస్తుంటుంది.
అందులో కొన్ని నిజమైతే కొన్ని గాసిప్స్ క్రియేటవుతాయి. ఇక హీరోయిన్ రియల్ లైఫ్ కి సంబందించిన విషయాలలోను రక రకాల ప్రచారాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే కియారా అద్వాని ఒక యంగ్ హీరోతో డేటింగ్ చేస్తుందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ యంగ్ హీరోనే సిద్ధార్థ్ మల్హోత్ర. ఈ బాలీవుడ్ హీరో తో.. కియారా రిలేషన్ లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీళ్లిద్దరు లేట్ నైట్ పార్టీస్ కి వెళుతున్నారని..బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయట.
కానీ ఈ విషయంలో కియారా గానీ.. సిద్ధార్థ్ గానీ స్పందించలేదు. అయితే తాజాగా కియారా అద్వానీ నటించిన ‘ఇందూకీ జవానీ’ ట్రైలర్ రిలీజ్ అయ్యాక సిద్దార్థ్ స్పందిస్తూ ‘ఇందూ ఫుల్ ఫైర్ లో ఉంది.. చూడ్డానికి వెయిట్ చేస్తున్నామ’ని ట్వీట్ చేశాడు. దీనికి కియారా ‘ఇందూ కూడా నిన్ను చూడ్డానికి ఎదురుచూస్తోంద’ని రిప్లై ఇచ్చింది. దాంతో నిజంగానే ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారట.