కంగనా రనౌత్ కి ఆ స్టార్ హీరో తో శారీరిక సంబంధం ఉందా ?

కంగనా రనౌత్ గ్యాంగ్ స్టర్ సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంటరైంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా విలక్షణ పాత్రలకి కేరాఫ్ అడ్రస్ గా మారుతుందని ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. అలాగే కంగనా రనౌత్ బాలీవుడ్ లో విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. కొన్ని కథలు కంగనా రనౌత్ కోసమే తయారవుతాయనడంలో కూడా సందేహం లేదు. ఇక కంగనా రనౌత్ మన టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయమే. ప్రభాస్ తో కలిసి ఏక్ నిరంజన్ సినిమాలో నటించింది.

కాగా కంగనా రనౌత్ కి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణం కేసులో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలు బయటపడుతూ ఊహించని మలుపు తిరుగుతోంది. ఈ కేసును ముంబై పోలీసులు విచారిస్తుండగానే… రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి ఇప్పటికే అరెస్ట్ అయిన బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తా సహా పలువురి మధ్య జరిగినవిగా భావిస్తున్న వాట్సాప్ చాటింగ్ లు బయటపడ్డాయి. దాదాపు 500 పేజీలకు పైగా ఉన్న ఈ వాట్సాప్ మెసేజ్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇందులో బాలీవుడ్ స్టార్స్ కంగన రనౌత్ – హృతిక్ రోషన్ వివాదం గురించి.. ప్రధాని కార్యాలయంతో అర్ణబ్ కు ఉన్న సంబంధాల గురించి వాట్సాప్ చాటింగ్ లో ప్రస్తావించడం షాకింగ్ విషయం. ఈ వాట్సాప్ చాట్ లో కంగనా రనౌత్ కు ఎరోటోమానియా ఉందని.. హృతిక్ రోషన్ తో సంబంధం ఉందని అర్నాబ్ ఆరోపించినట్లు తెలుస్తోందని బాలీవుడ్ మీడియాలో చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా లీకైన సంభాషణల్లో ఓ కేంద్రమంత్రిని ఉద్దేశించి దాస్ గుప్తా ‘యూజ్ లెస్’ అని సంబోధించడం.. ‘మంత్రులంతా మనతోనే ఉన్నారు’ అని అర్నబ్ గోస్వామి మరో మెసేజ్ లో చెప్పినట్లు ఉందట. ఈ విషయంలో పలు సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయట. ఈ కారణంగానే కంగన రనౌత్ – హృతిక్ రోషన్ ల మధ్య శారీరిక సంబంధం ఉందా అని కూడా మాట్లాడుకుంటున్నారట. మరి ఇందులో వాస్తవం ఏంటన్నది తెలియాల్సి ఉంది.