“జవాన్” దెబ్బతో నయన్ ఫేట్ మారిపోయిందా?

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అయినటువంటి మరో చిత్రమే “జవాన్” కాగా ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించగా తమిళ దర్శకుడు అట్లీ అయితే ఈ సినిమాని చేసాడు. కాగా ఈ సినిమా అన్ని అంచనాలు అందుకొని షారుఖ్ మరియు అట్లీ కెరీర్ లో పెద్ద హిట్స్ గా నిలిచింది.

అయితే ఈ సినిమాలో దాదాపు అంతా తమిళ స్టార్ నటులే నటించారు. దీంతో ఓ రకంగా తమిళ సినిమా అని కూడా దీనిని అనొచ్చు. అయినా తమిళ నాట అంత అగ్రెసివ్ వసూళ్లు ఏమీ దీనికి వచ్చి పడిపోలేదు. కాగా ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నయనతారకి అయితే జవాన్ దెబ్బతో ఇప్పుడు ఫేట్ మారిపోయింది అని సినీ వర్గాలు చెప్తున్నాయి.

లేటెస్ట్ గాసిప్ ప్రకారం అయితే జవాన్ లో నయన్ ని చూసిన బాలీవుడ్ నిర్మాతలు దర్శకులు ఆమెకి భారీ ఆఫర్లు ఇస్తూ సినిమాలు చేయించుకునేందుకు వస్తున్నారట. దీనితో నయన్ కి బాలీవుడ్ లో మాత్రం ఇప్పుడు ఫుల్ డిమాండ్ నెలకొంది అని రూమర్స్ మొదలయ్యాయి.

అయితే మరోపక్క అంత సీన్ లేదని నయన్ కి ఏమంత పెద్ద ఆఫర్లు వచ్చేయడం లేదని ఒకవేళ వచ్చినా నయన్ అయితే వాటికి ఒకే చెప్పే ఛాన్స్ లు కూడా తక్కువే ఉన్నాయని తెలుస్తుంది. జవాన్ అంటే షారుక్ అందులోని తమిళ దర్శకుడు టెక్నీషియన్స్ కూడా వారే కావడంతో చేసింది అన్ని నెక్స్ట్ అయితే కష్టమే అని కొందరు అంటున్నారు.