విలక్షణ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనగనగా ఒక ధీరుడు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ ఆ తర్వాత గబ్బర్ సింగ్, వకీల్ సాబ్ , బలుపు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న శృతిహాసన్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో బిజీగా ఉంది.
ఇలా ఒకవైపు సినిమాలతో బిజీగా ఉండే శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ సర్జరీ చేయించుకున్న విషయాన్ని బయటపెట్టింది. సాధారణంగా హీరో హీరోయిన్లు అందంగా కనిపించడానికి తమ శరీరంలో ఉన్న అవయవాల షేపులు సర్జరీ చేయించుకుని మార్చుకుంటారు. అలాగే శృతిహాసన్ కూడా తన ముక్కు లావుగా ఉండటం వల్ల సన్నగా కనిపించడానికి సర్జరీ చేయించుకుందని వార్తలు వినిపించాయి.
ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ ఈ విషయం గురించి స్పందిస్తూ.. సర్జరీ చేయించుకున్న విషయం నిజమేనని దీని గురించి దాచాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. అయితే ముక్కు సన్నగా కనిపించడం కోసం సర్జరీ చేయించుకున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చింది . నిజానికి గతంలో ముక్కుకు గాయం అవటం వల్ల సర్జరీ చేయించుకున్నానని శృతిహాసన్ అసలు విషయం బయట పెట్టింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాతో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో కూడా శృతి హాసన్ నటిస్తోంది.