బిడ్డ పుట్టిన తర్వాత ఇంతలా స్కిన్ షో చేయడం అవసరమా.. ప్రణీత పై నేటిజన్స్ ట్రోల్!

అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి గుర్తింపు పొందిన ప్రణీత సుభాష్ ఏం పిల్ల ఏం పిల్లడు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. తెలుగులో సెకండ్ హీరోయిన్ గా కొన్ని సినిమాలలో నటించిన కూడా మంచి గుర్తింపు ఏర్పరచుకుంది. ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ప్రణీత కరోనా సమయంలో వివాహం చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన ప్రణీత సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో టచ్ లో ఉంటుంది.

ఇలా తనకు సంబందించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండే ప్రణీత తన అందమైన ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తోంది. ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత..బిడ్డ పుట్టిన తర్వాత కూడా అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇక తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో ప్రణీత తన బిడ్డని ఎత్తుకొని గ్లామరస్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

దీంతో కొంతమంది నెటిజన్స్ బిడ్డని ఎత్తుకొని ఇలాంటి ఫోటోలకు ఫోజులు ఇవ్వటానికి బుద్ది లేదా ? అంటూ మండిపడుతున్నారు. మరికొంత మంది మాత్రం ప్రణీతకు సపోర్ట్ చేస్తూ ప్రతీ చిన్న విషయానికి ఇలా విమర్శించటం పద్ధతి కాదని ప్రణీతను వెనకేసుకొస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రణీత షేర్ చేసే ఫోటోలు చూస్తుంటే ఆమె మళ్ళీ సినిమాలలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెళ్లి తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమైన ప్రణీత ..బిడ్డ పుట్టిన తర్వాత సినిమాలలో రీ ఎంట్రీ ఇస్తుందో? లేదో? చూడాలి మరి.