Deepti Sunayana: దీప్తి సునయన ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ వీడియోస్, వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న దీప్తి సునయన బిగ్ బాస్ సీజన్ 2 కార్యక్రమానికి వెళ్లి మరింత గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈమె షణ్ముఖ్ జస్వంత్ ప్రేమలో ఉండటం వల్ల ఈ జంటకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అదే సమయంలోనే షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా వెళ్లారు. ఇక బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా వెళ్లి నటువంటి షణ్ముఖ్ జస్వంత్ సిరితో చనువుగా ఉండటం వల్ల దీప్తి సునయన తన లవ్ కి బ్రేకప్ చెప్పింది.
ఇక వీరిద్దరూ విడిపోయినప్పటినుంచి దీప్తి తన స్నేహితులతో కలిసి చేసే హంగామా మామూలుగా లేదు. నిత్యం సోషల్ మీడియా వేదికగా డాన్స్ వీడియోలు చేస్తూ హల్చల్ చేస్తున్నారు. అలాగే తన స్నేహితులతో కలిసి పెళ్లిళ్లు పార్టీలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్న దీప్తి సునయన సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు. కొబ్బరి బొండం తాగుతూ అలాగే ఆ కొబ్బరిను తింటూ ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కొబ్బరి బొండం తాగడంలో విశేషం ఏముంది.. మరి ఈ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇంత బిల్డప్ ఇవ్వడం అవసరమా… అంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి షణ్ముఖ్ జస్వంత్ తో బ్రేకప్ తర్వాత దీప్తి హంగామా మామూలుగా లేదని చెప్పాలి.