అనుష్క నిశ్శబ్ధం మీదే ఆ సినిమాలన్ని ఆధారపడ్డాయంటే కష్టమే ..?

ప్రస్తుతం అందరూ హాట్ హాట్ గా మాట్లాడుకుంటుంది అనుష్క నటించిన నిశ్శబ్ధం సినిమా గురించే. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. వాస్తవంగా ఈ సినిమాని మేకర్స్ ఓటీటీలో రిలీజ్ చేయాలనుకోలేదు. ఇలాంటి సినిమా థియోటర్స్ లో వస్తేనే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని భావించారు. కాని కరోనా మూలంగా థియోటర్స్ ఎప్పుడు తెరుస్తారో తెలియక, ఒకవేళ తిరిచినా జనాలు ఎంతవరకు ధైర్యం చేసి వస్తారో అర్థం కాక మేకర్స్ ఓటీటీలో రిలీజ్ చేందుకు రెడీ అయ్యారు.

Nishabdham Movie | Cast, Release Date, Trailer, Posters, Reviews, News,  Photos & Videos | Moviekoop

కాగా ఇన్నాళ్ళు ప్రేక్షకులే ఈ సినిమా రిలీజ్ అండ్ రిజల్ట్ గురించి ఆతృతగా ఎదురు చూశారు. కాని ఇప్పుడు రిలీజ్ కి రెడీ గా ఉన్న కొన్ని సినిమాల మేకర్స్ కూడా అనుష్క నిశ్శబ్ధం రిజల్ట్ మీద ఆసక్తిగా ఉన్నారట. అందుకు కారణం లేకపోలేదు. ఇప్పటి వరకు భారీ అంచనాల మధ్య తెలుగు సినిమాలతో పాటు ‘పెంగ్విన్’ లాంటి మల్టీ లాంగ్వేజ్ సినిమాలు రిలీజయ్యాయి. కాని ఈ సినిమాలన్ని ప్రేక్షకులను కాస్త నిరాశపరచాయి. ఇటీవల ఎన్నో అంచనాలతో రిలీజైన నాని ‘ వి ‘ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేపోయింది.

దాంతో అందరూ అనుష్క నిశ్శబ్ధం మీద ఆశలు పెట్టుకున్నారట. ఈ సినిమా గనక రిలీజై మంచి సక్సస్ ని అందుకుంటే ఆ తర్వాత మరికొన్ని సినిమాలని వరసగా ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే రామ్ నటించిన రెడ్, సాయి ధరం తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్, వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా ఉప్పెన, ప్రదీప్ మాచి రాజు నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. లాంటి సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. అంతేకాదు ఈ సినిమాల మీద ప్రేక్షకులకి మంచి అంచనాలున్నాయి. చూడాలి మరి నిశ్శబ్ధం రిజల్ట్ ఎలా ఉంటుందో.