సమంత సోషల్ మీడియాలో కనిపించకపోవడానికి అధిక వ్యాయామాలే కారణమా?

సౌత్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏం మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సమంత మొదటి సినిమాలో తన తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఆ సినిమా హిట్ అవటంతో టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం సమంత తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.

ఇదిలా ఉండగా ఇటీవల సమంత గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సమంత కొంతకాలంగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటుంది. అయితే అనారోగ్యం కారణంగానే సమంత సోషల్ మీడియాలో కనిపించటం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో సమంత చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. ఈ క్రమంలో చెన్నైలోని ఒక ఆస్పత్రి లో చికిత్స పొందింది. తాజాగా సమంత మరొకసారి చర్మ వ్యాధితో బాధపడుతుందని అందువల్లే ఆమె మీడియా ముందుకి రావడం లేదని చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఇటీవల సమంత గురించి మరొక వార్త వినిపిస్తోంది. సమంత అనారోగ్యానికి కారణం ఆమె చేసే అధిక వ్యాయామం తెలుస్తోంది. సమంత ఎక్కువ సమయం వ్యాయామాలకు కేటాయిస్తూ జిమ్ లోనే గడుపుతుంది. ఈ క్రమంలో కష్టతరమైన వ్యాయామాలు చేయడమే కాకుండా అధిక బరువులు కూడా ఎత్తుతూ అందరిని ఆశ్చర్యపరిచింది. సమంత జిమ్ లో చేసే వ్యాయామాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. వీటిలో సమంత అధిక బరువులను లాగుతున్న వీడియో కూడా వైరల్ అయింది. ఇలా అధిక బరువులో ఎత్తటం వల్ల సమంత నడుము నొప్పితో బాధపడుతుందని అందువల్లే సోషల్ మీడియాలో తన వ్యాయామానికి సంబంధించిన పోస్టులు కూడా చేయడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి క్లారిటీ రావాలంటే సమంత స్పందించాల్సి ఉంటుంది.