తెలుగు, తమిళ భాషల్లో కంటిన్యూస్ గా భారీ కమర్షియల్ సినిమాలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది కీర్తి సురేష్. అంతేకాదు లాక్ డౌన్ కారణంగా థియోటర్స్ మూతపడటంతో హీరోలకంటే ధీటుగా తన సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చింది. సాధారణంగా మహానటి ఫేం ని కాపాడుకోవాలన్న తపన కీర్తి కి బాగానే ఉందని అనుకున్నారు. ఈ క్రమంలోనే ఓరియెంటెడ్ సినిమాగా పెంగ్విన్ ఓటీటీలో రిలీజైంది.
అలాగే కీర్తి సురేష్ నటించిన మరో సినిమా మిస్ ఇండియా కూడా ఓటీటీలో రిలీజ్ అయింది. కాని ఈ రెండు సినిమాలు కీర్తి సురేష్ ని బాగా డిసప్పాయింట్ చేశాయి. అంతేకాదు భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులతో పాటు ఓటీటీ వాళ్ళని డిసప్పాయింట్ చేసిందని అంటున్నారు. ఎన్నో నమ్మకాలు పెట్టుకున్న రెండు సినిమాలు ఇలా నిరాశపరుస్తాయని ఎవరూ ఊహించలేదు. దాంతో కీర్తి కూడా ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలని ఒప్పుకోకూడదని డిసైడయిందని మిస్ ఇండియా రిలీజ్ తర్వాత వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల ప్రభావం , మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాగా రాబోతున్న గుడ్ లక్ సఖీ మీద పడబోతుందని సమాచారం. ఈ సినిమాని కూడా ఫ్లాపయితే పరిస్థితేంటన్న ఆలోచనలో ఉన్నారట. మరి ఈ సినిమా థియోటర్స్ లో రిలీజ్ అవుతుందా లేక ఓటీటీలో రిలీజ్ అవుతుందో ఇంకా క్లారిటీ లేనప్పటికి చాలామందికి మాత్రం గుడ్ లక్ సఖీ మీద అంతగా నమ్మకాలు లేవని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా రిలీజై ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో.