అనుష్కని అడుగుతున్నారటగానీ.!

ఎందుకో అనుష్క రెగ్యులర్‌గా సినిమాలు చేయడం మీద పెద్దగా ఫోకస్ పెట్టడంలేదు. ప్రస్తుతానికైతే ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలోనే నటిస్తోంది. అది తప్ప ఇంకో సినిమా ఆమె చేయట్లేదన్న సంగతి తెలిసిందే.

ఓ సీనియర్ హీరో సినిమా కోసం అనుష్కని సంప్రదించారట. గతంలో ఆ సీనియర్ హీరోతో ఆమె నటించింది కూడా. కానీ, అనుష్క ఒప్పుకోలేదట. ఎందుకు.? ఒప్పుకోవట్లేదు.? అన్నదానిపై స్పష్టత అందాల్సి వుంది.

అనుష్క ఓకే.. అంటే, రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఇచ్చేందుకు సిద్ధంగానే వున్నారట. ‘నో’ చెప్పేసినాగానీ, నిర్మాత మాత్రం ఆమె చుట్టూనే తిరుగుతున్నాడని సమాచారమ్.

ఎవరా సీనియర్ హీరో.? ఎవరా నిర్మాత.? ఏంటా ప్రాజెక్ట్.? ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే, అనుష్క ఒప్పుకుంటే మాత్రం మళ్లీ తెలుగులో పూర్వ వైభవం పొందే అవకాశాల్లేకపోలేదు.

సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత ఏ రేంజ్‌లో వుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీనియర్ హీరోల సరసన నటించదగ్గ కటౌట్స్ వుండడం లేదు ప్రస్తుతం హీరోయిన్లలో. సో, అనుష్కలాంటి కటౌట్ అయితే, స్క్రీన్ మీద సీనియర్ హీరోలతో జోడీ అందంగా కనిపిస్తుంది. జేజమ్మా.! కొంచెం ఒప్పుకోమ్మా.!