బుల్లితెరపై హాటెస్ట్ యాంకర్‌గా అనసూయకి బోలెడంత పాపులారిటీ వుంది. అలాగే ఈ మధ్య వెండితెరపైనా అనసూయ తన ఉనికిని బాగానే చాటుకుంటోంది. ‘రంగస్థలం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన అనసూయ, ఓ మోస్తరు నటిగా అవకాశాలు దక్కించుకుంటూ వెండితెరపై చెలామణీ అవుతోంది.
అయితే, విజయ్ దేవరకొండ స్థాయితో అనసూయ స్థాయిని పోల్చగలమా.? ఖచ్చితంగా పోల్చలేం. విజయ్ దేవరకొండ అంటే చిన్న హీరో ఏం కాదు. విజయ్ దేవరకొండతో పోల్చితే, అనసూయ మాత్రం ఖచ్చితంగా చిన్న నటి మాత్రమే.
అదలా వుంటే, రౌడీ ఎప్పుడూ డైరెక్ట్‌గా కానీ, ఇన్ డైరెక్ట్‌గా కానీ, అనసూయ మీద సెటైర్లు వేసింది లేదు. కానీ, అనసూయ మాత్రం ఛాన్స్ దొరికినప్పుడల్లా కాదు కాదు, ఛాన్స్ తీసుకుని మరీ విజయ్‌పై సెటైర్లు వేసే సాహసం చేస్తోంది.
ఇదంతా కేవలం తన పాపులారిటీ పెంచుకోవడం కోసమే అనక తప్పడం లేదు. విజయ్ దేవరకొండని ఏదో ఒక రకంగా కెలికితే తనకు మరింత క్రేజ్ పెరుగుతుందనుకుంటున్న అనసూయ ఈ స్థాయిని శ్రీరెడ్డితో పోల్చుతున్నారు కొందరు నెటిజన్లు. అనసూయది అంత నీచమైన స్థాయినా.? జర శోచ్‌లో.!