టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి ఎలాంటి బంధుత్వం స్నేహబంధం ఉందో మనకు తెలిసిందే.నిర్మాతగా అల్లు అరవింద్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే తన బావ చిరంజీవి విషయంలో అన్ని తానే చూసుకునేవారు. ఇక మొన్నటివరకు అల్లు మెగా ఫ్యామిలీ మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా ఉన్నప్పటికీ గత కొంతకాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య మనస్పర్ధలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి.ఈ విషయంపై మెగా అల్లు ఫ్యామిలి పలుమార్లు స్పందించి ఎలాంటి విభేదాలు లేవని చెప్పినప్పటికీ వీరి వ్యవహార శైలి చూస్తుంటేనే వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని తెలుస్తోంది.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదలవుతున్న సమయంలోనే అరవింద్ ఏకంగా కాంతారా సినిమాని తెలుగులో విడుదల చేసి గాడ్ ఫాదర్ సినిమాకు గట్టి షాక్ ఇచ్చారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా విషయంలో కూడా అల్లు అరవింద్ తన బావకు ఏ మాత్రం సపోర్ట్ చేయలేదని తెలుస్తుంది.ఇప్పటికే సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య వీర సింహారెడ్డి సినిమాలో పోటీ పడుతుండగా డబ్బింగ్ సినిమాలకు తక్కువ థియేటర్లు ఇస్తామని నిర్మాత మండలి పేర్కొంది.
ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలపై అల్లు అరవింద్ మాట్లాడుతూ సినిమాలో కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేదని ఏ భాషా చిత్రాలను ఆయన ప్రేక్షకులు చూస్తారంటూ ఈయన చిరంజీవికి వ్యతిరేకంగా మాట్లాడారు. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలువచ్చినప్పటికీ డబ్బింగ్ సినిమాలను కూడా విడుదల చేస్తే దేని కలెక్షన్లు దానికి ఉంటాయంటూ మరోసారి చిరంజీవి సినిమాకు పోటీగా వారసుడు సినిమాని తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఈ రెండు కుటుంబాల మధ్య మనస్పర్ధలు గురించి వార్తలు వస్తున్నాయి.ఇలా అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో చిరంజీవి అంటే అల్లు అరవింద్ కు అంత కోపమా అందుకే ఇలా చేస్తున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.