అల్లు అర్జున్‌కి అంత తొందరేమొచ్చింది.?

‘పుష్ప’ సినిమా పూర్తవ్వాలి.. తదుపరి సినిమా సెట్స్ మీదకు వెళ్ళాలి.! కానీ, ఈలోగానే కర్చీఫ్ వేసేస్తున్నాడు అల్లు అర్జున్, డైరెక్టర్ల మీద. తాజాగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా ప్రకటితమైన సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ తొందరపడ్డాడుగానీ, సందీప్ రెడ్డి వంగా అస్సలు ఖాళీగా లేడు. ‘యానిమల్’ సినిమా పూర్తి చెయ్యాలి, ఆ తర్వాత ‘స్పిరిట్’ అనే సినిమా చేయాల్సి వుంది. అప్పుడెప్పుడో ‘అర్జున్ రెడ్డి’ సినిమా తీశాడు సందీప్ రెడ్డి వంగా. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్ళిపోయాడు.

ఎటూ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు గనుక, సందీప్ రెడ్డి వంగాకి ఇదో అడ్వాంటేజ్ అనుకోవాలా.? లేదంటే, ముందే కర్చీఫ్ వేసేసి ‘తొందరపాటు’ బయటపెట్టుకున్నారనుకోవాలా.?

ప్రెస్టీజియస్ ప్రాజెక్టులకైతే కొదవ లేదు టాలీవుడ్‌లో. కానీ, వీటిల్లో ఎన్ని పూర్తయి, ప్రేక్షకుల ముందుకొస్తాయో తెలియని పరిస్థితి. ‘పుష్ప ది రూల్’పై బజ్ కోసమే సందీప్ వంగా పేరు వాడుకుంటున్నారన్న ప్రచారంలో నిజమెంతో మరి.?