చరణ్ కంటే, ఎన్టీయార్‌తోనే అల్లు అర్జున్‌కి అవసరాలెక్కువ.!

మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్‌ని దాదాపు వెలివేసేశారు.! దానిక్కారణం, అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో కొందరు మెగా కాంపౌండ్ మీద చేస్తున్న దుష్ప్రచారమే. దాన్ని అల్లు అర్జున్ ఆపడంలేదు. పైగా, తనకు అభిమానులు కాదు, ఆర్మీ వుందంటున్నాడు.

ఈ క్రమంలో అల్లు అర్జున్, నందమూరి కుటుంబానికి దగ్గరయ్యాడు. నందమూరి బాలకృష్ణతో అత్యంత సన్నిహితంగా వుంటున్నాడు. తాజాగా ‘తెలుగు ప్రైడ్’ అంటూ యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని కొనియాడుతూ, ఆ యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానుల నుంచీ పాజిటివ్ టోన్ రాబట్టుకున్నాడు.

ఇది సహజంగానే మెగాభిమానులకి నచ్చడంలేదు. ‘మై బ్రదర్..’ అని మాత్రమే సరిపెట్టాడు అల్లు అర్జున్ ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ వ్యవహారానికి సంబంధించి రామ్ చరణ్ పేరుని ప్రస్తావిస్తూ. అదే సమయంలో ఎన్టీయార్‌ని తెలుగు ప్రైడ్ అన్నాడు.

అల్లు అర్జున్ ఇదంతా కావాలనే చేస్తున్నాడన్నది ఓపెన్ సీక్రెట్. దీనిక్కారణమేంటి.? అని ఆలోచిస్తే, ఎన్టీయార్‌తో.. ఆ బ్రాండ్ ఇమేజ్‌తో పని వుండడం వల్ల.. అందునా నందమూరి దన్ను కావాల్సి రావడంతోనేనట. అల్లు అరవింద్ కూడా చిరంజీవిని కాదని, బాలయ్యతో ఎక్కువగా రాసుకుపూసుకు తిరుగుతున్నారు.