RRR Movie: థియేటర్స్ లో ఇనుప కంచెలు, మేకులా? మరీ ఇంత దారుణమా అంటున్న ఫ్యాన్స్… ఎందుకంటే… ?

RRR Movie:మొన్నటి దాకా పుష్ప మేనియాతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన రచ్చ మరువక ముందే ఇప్పుడు మరో రచ్చ మొదలైంది. అదే ఆర్ ఆర్ ఆర్. భారీ అంచనాల నడుమ విడుదల కానున్న ఈ సినిమా పైన రోజురోజుకీ ఎక్ష్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. మామూలు ప్రేక్షకులకు సైతం ఈ సినిమా చూడాలి అని అనిపించేలా హైప్ తీసుకొచ్చారు మూవీ మేకర్స్. ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఒక్కరి సినిమా విడుదల అవుతుంది అంటేనే ఫ్యాన్స్ గోల తట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది ఈ సారి ఇద్దరు స్టార్ హీరోస్ ఒకే తెరపై కనిపిస్తే.. ఇక బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు. తమ అభిమాన హీరో సినిమా అంటే మామూలుగా ఉండదు అంటూ వారు గర్వంగా చెప్పుకొంటూ కాలర్ ఎగిరేసుకొని, దర్జాగా తిరుగుతున్నారు.

ఐతే ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 25న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు మరో వార్త అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇంతటి భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు వచ్చే ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం థియేటర్ యజమానులు పలు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అభిమానుల తాకిడిని తట్టుకోవడం ఇప్పుడు వారికి కత్తి మీద సాములా మారింది. దీంతో థియేటర్స్ కి ఎలాంటి డామేజ్ జరగకుండా పలు జాగ్రత్తలు వహిస్తున్నారు. పుష్ప సినిమా సమయంలోనూ థియేటర్ స్క్రీన్ ఎక్కి నానా హంగామా సృష్టించారు. అంతే కాదు స్రీన్లను చించేసి రచ్చ రచ్చ చేసి, ఓనర్స్ కి నష్టం కలించారు.

ఇక ఆ విషయం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు థియేటర్ యజమానులు సరి కొత్తగా ఆలోచిస్తున్నారు. స్క్రీన్ పైకి ఎక్కకుండా తెరకు, స్క్రీన్ కి మద్య ఇనుప కంచెలు, మేకులు అమర్చి ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఐతే దీనిపై భారీ స్థాయిలో మీమ్స్, ట్రోల్స్ రావడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అభిమానాన్ని ఈ విధంగా అడ్డుకుంటారా అని కొందరు అంటే, ఇది అన్యాయం, మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. మరి కొంత మంది ఫ్యాన్స్ మాత్రం తమ అభిమానాన్ని ఎవరూ ఆపలేరని ఇనుప చెప్పులు వేసుకుని అయినా సరే వస్తానంటూ పలువురు స్పందిస్తున్నారు.